News November 7, 2025

HYD: ట్రబుల్ షూటర్ వచ్చేస్తున్నారు!

image

పితృవియోగంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు మళ్లీ యుద్ధరంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు దగ్గర పడుతుండడంతో, ట్రబుల్ షూటర్‌గా ఆయన ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. BRS జైత్రయాత్రను జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెట్టేందుకు, హరీశ్ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News

News March 15, 2026

KGM: ఏపీటీసీఐఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సాయి మనోహర్

image

ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ (APTCIA) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన సాయి మనోహర్ దీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం తిరుపతి తిరుచానూరులో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు. టైప్, కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.

News March 15, 2026

ధాన్యం కొనుగోలుకు 240 కేంద్రాలు: కలెక్టర్ సత్యశారద

image

జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో ఆమె సమీక్షించారు.

News March 15, 2026

హెల్ప్ చేస్తాం.. కానీ, మాకు డబ్బులు కావాలి: జెలెన్‌స్కీ

image

ఇరాన్‌తో తాము యుద్ధం చేయడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు <<19386678>>జెలెన్‌స్కీ<<>> అన్నారు. షాహెద్ డ్రోన్ల నుంచి పశ్చిమాసియా దేశాలను కాపాడేందుకు రక్షణ కవచంలా మారుతున్నామని తెలిపారు. రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లను కూల్చడంలో ఆరితేరిన ఉక్రెయిన్ ఇప్పుడు ఆ అనుభవాన్ని గల్ఫ్ దేశాలకు పంచుతోంది. దీనికి ప్రతిఫలంగా తమకు టెక్నాలజీ, నిధులు కావాలని జెలెన్‌స్కీ కోరారు. ఇప్పటికే ఖతర్, UAE, సౌదీకి ఎక్స్‌పర్ట్స్‌ను పంపారు.