News November 7, 2025

జూబ్లీ ఉపఎన్నిక.. రూ.3.33 కోట్ల నగదు సీజ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు నగదు, 701 లీటర్ల మద్యం, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు వంటి ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌ 7వ తేదీ ఉదయం వరకు మొత్తం 24 మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛా యుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు కఠిన నిఘా కొనసాగిస్తున్నాయి.

Similar News

News April 2, 2026

గూడూరులో ROB పూర్తి చేయండి: MP

image

గూడూరులో పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఫైఓవర్ పూర్తి చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్నను కోరారు. 2008 నుంచి పనులు నిలిచిపోవడంతో గూడూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట స్టేషన్ల పరిధిలో ముఖ్య రైళ్లకు స్టాపింగ్‌లు ఇవ్వాలని కోరారు. తన వినతులపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

News April 2, 2026

ఏలూరు: ఆయన సర్వీస్ అంతా దాడులే..!

image

బుట్టాయగూడెం <<19544691>>ఎస్‌ఐ <<>>ఉమామహేశ్వరరావు బాధ్యతారహిత వైఖరిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ద్వారకాతిరుమల, ధర్మాజిగూడెంలలో ప్రజలపై దాడులు చేసి గ్రామస్థుల నిర్బంధానికి గురైన ఆయన, తాజాగా లక్కవరంలోనూ అదే తీరును ప్రదర్శించారు. ఎస్‌ఐ వేధింపులతో విసుగెత్తిన ప్రజలు ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడం కలకలం రేపింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన అధికారి దాడులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

News April 2, 2026

నిజామాబాద్: ‘మీ సేవ’ వాత.. భారీగా పెరిగిన ధరలు!

image

జిల్లాలో మీ సేవ సేవల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ప్రభుత్వం యూజర్ ఛార్జీలను 50% పెంచి, దానికి 18% జీఎస్టీని చేర్చడంతో మొత్తం 68% భారం పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరలతో రూ.35 ఉన్న ‘A’ కేటగిరీ సేవలు రూ.62కు, రూ.45 ఉన్న ‘B’ కేటగిరీ (కుల, ఆదాయ ధృవీకరణ) ధరలు రూ.80కి చేరాయి. జిల్లాలోని 250 కేంద్రాల్లో నిత్యం సేవలు పొందే ప్రజలు ఈ పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.