News November 7, 2025

ఎర్రచందనం సాగు చేస్తున్న 198 మంది రైతులకు రూ.3 కోట్లు విడుదల

image

నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ (NBA) ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం సాగు చేస్తున్న 198 మంది రైతులకు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఒక అకడమిక్ లబ్ధిదారునికి మొత్తం రూ.3 కోట్లు విడుదల చేసింది. యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ABS) విధానంలో భాగంగా ఈ నిధులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ ద్వారా పంపిణీ చేశారు. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల 48 గ్రామాల రైతులకు ఈ ప్రయోజనం చేకూరింది.

Similar News

News November 8, 2025

పైలట్‌ను నిందించలేం: సుప్రీంకోర్టు

image

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా క్రాష్‌కి సంబంధించి పైలట్‌ను నిందిచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రమాదంలో చనిపోయిన మెయిన్ పైలట్ సుమిత్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. DGCA, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం. మీ కుమారుడిని ఎవరూ నిందిచలేరు. పైలట్ తప్పు వల్లే ప్రమాదం జరిగిందని దేశంలో ఎవరూ భావించడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

News November 8, 2025

సంకటహర గణపతి వ్రతం ఎలా చేయాలంటే..?

image

నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి. గణపతి పూజ చేసి, ఎర్ర గుడ్డలో పసుపు, కుంకుమ, బియ్యం, ఖర్జూరం, వక్కలు, దక్షిణ వేసి ముడుపు కట్టి, కోరిక మనసులో అనుకొని 21 ప్రదక్షిణలు చేయాలి. ఉపవాసం, మౌనంగా ఉంటూ గణపతిని కొలవాలి. సాయంత్రం దీపాలు పెట్టాలి. ముడుపు బియ్యంతో బెల్లం పాయసం, ఉండ్రాళ్లతో నైవేద్యం పెట్టాలి. వ్రతానికి ముందు రోజు, తర్వాత రోజు కూడా మద్యమాంసాలు ముట్టొద్దు. మరుసటి రోజు హోమం చేస్తే శుభం.

News November 8, 2025

‘ఓట్ చోరీ’.. యువతి సెల్ఫీ దుమారం!

image

ఓట్ చోరీ జరుగుతోందని రాహుల్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దానికి బలం చేకూర్చేలా ఓ లాయర్ సెల్ఫీ వైరలవుతోంది. పుణేకు చెందిన ఉర్మీ అనే లాయర్ బిహార్‌లో ఎన్నికల రోజు.. ‘Modi-Fied ఇండియా కోసం ఓటేశాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాంగ్రెస్ ఫాలోవర్స్ ఆమె అకౌంట్‌ను పరిశీలించగా.. గతంలో ‘పుణే ఎన్నికల్లో ఓటేశాను’ అని మరో ఫొటో ఉంది. ఇలాగే ఓటేస్తున్నారు అని కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె ఫొటోలను షేర్ చేస్తున్నారు.