News November 7, 2025

కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

TG: మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గాడిద ఫొటోపై ‘గాడిద నీపై అరిస్తే.. నువ్వు దానిపై అరవకు’ అని ఉన్న కొటేషన్‌ను షేర్ చేశారు. దీనికి ‘If you know, you know’ అని క్యాప్షన్ పెట్టి స్మైలింగ్ ఎమోజీని జోడించారు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం <<18226951>>రేవంత్‌కు<<>> పరోక్ష కౌంటర్‌గానే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని BRS వర్గాలంటున్నాయి.

Similar News

News March 25, 2026

మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

image

AP: సొంత ఊరికి దూరంగా ఉంటూ నగరాలు, పట్టణాల్లో ఉద్యోగం చేసే మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి వసతి, భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘సఖి నివాస్’ పేరిట కొత్తగా 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హాస్టల్‌లో 30 మందికి వసతి కల్పించనుంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగినులతో పాటు చదువుకునే యువతులకు తక్కువ ధరకే వసతి, భోజన సదుపాయం కల్పించనున్నారు.

News March 25, 2026

షేన్ వార్న్ దూరదృష్టి.. RR డీల్‌తో పిల్లలకు భారీ ఆస్తి!

image

RR మాజీ కెప్టెన్, దివంగత షేన్ వార్న్ ముందుచూపు ఎలాంటిదో ఇప్పుడు రుజువైంది. IPL ప్రారంభంలో 4 సీజన్లకు కలిపి కేవలం ₹9.35 కోట్ల శాలరీ మాత్రమే తీసుకున్న ఆయన రిటైర్మెంట్ డీల్‌లో ఆడిన ప్రతి సీజన్‌లో 0.75% వాటా కావాలని కండిషన్ పెట్టారు. అలా 4 ఏళ్లలో 3% వాటా దక్కించుకున్నారు. తాజాగా RR ₹15,301 కోట్లకు అమ్ముడవడంతో ఆ 3% విలువ ఏకంగా ₹460 కోట్లకు చేరింది. ఇప్పుడు వార్న్ పిల్లలు కోటీశ్వరులయ్యారు.

News March 25, 2026

ఆముదం సాగుకు అనువైన సూటి రకాలు

image

☛ హరిత: పంట కాలం 130-150 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5-6.5 క్వింటాళ్లు. ఎండు తెగులు, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ☛ జ్వాల: పంట కాలం 90-180 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5-6.5 క్వింటాళ్లు. ఎండు తెగులు, బూజు తెగులును తట్టుకుంటుంది.
☛ DDS-107: పంట కాలం 100-150 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5 క్వింటాళ్లు. ఎండు తెగులును తట్టుకుంటుంది.
☛ ప్రగతి: పంట కాలం 120-140 రోజులు. దిగుబడి ఎకరాకు 6- 7 క్వింటాళ్లు.