News November 7, 2025

పెద్దపల్లి: సూపర్వైజర్లకు స్పష్టమైన దిశానిర్దేశం

image

పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డా. వాణిశ్రీ అధ్యక్షతన సూపర్వైజర్లతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య కార్యక్రమాల అమలులో సూపర్వైజర్లు కీలకపాత్ర వహించాలని ఆమె సూచించారు. గర్భిణీల ఎర్లీ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల ప్రోత్సాహం, మలేరియా-డెంగ్యూ నివారణ, NCD డేటా నమోదు, 100% టీకాల అమలుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News March 16, 2026

MNCL: భర్త వేధింపులతోనే కొడుకును చంపి సూసైడ్ చేసుకుంది..?

image

కొడుకును చంపి మందమర్రికి చెందిన <<19386665 >>సత్యవాణి <<>>ఉరేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. కట్నం వేధింపులే సత్యవాణి మృతికి కారణమని సోదరుడు ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త మురళీవేణు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కట్నం కోసం వేధించేవాడని, పుట్టింటి వారితో మాట్లాడనిచ్చేవాడు కాదని పేర్కొన్నారు. కొడుకును చంపి సత్యవాణి ఆత్మహత్య చేసుకుందన్న భర్త మాటలపై అనుమానం ఉందని, విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

News March 16, 2026

బూర్జ: టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం

image

టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన బూర్జ మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఉప్పినివలస గ్రామానికి చెందిన జీవన్ కుమార్ (32) తన పనులను ముగించుకొని కొల్లివలస నుంచి స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొని తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసు కేసు నమోదైంది.

News March 16, 2026

BREAKING: మదనపల్లెలో యువకుడి మృతి

image

మదనపల్లెలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణంలోని నిమ్మనపల్లి రోడ్డు, బసినికొండకు చెందిన నారాయణ కుమారుడు అశోక్ కుమార్(26) ఇండేన్ గ్యాస్ ఆఫీస్‌లో పనిచేస్తాడు. ఈక్రమంలో ఆగి ఉన్న లారీ కింద నిద్రపోయాడు. ఇది గమనించని డ్రైవర్ లారీని స్టార్ట్ చేసి ముందుకు కదిలించాడు. చక్రాల కింద నలిగి అశోక్ కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు.