News November 7, 2025

బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచండి: వరంగల్ మేయర్

image

బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్‌ను కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డిన, ఎంహెచ్ఓ డా.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 10, 2026

సిద్ధిపేట: ‘ఆరోగ్య ఖాకీ’కి సీపీ శ్రీకారం

image

పోలీస్ అధికారుల సంక్షేమం కోసం సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ మంగళవారం ‘ఆరోగ్య ఖాకీ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శారీరకంతో పాటు మానసిక దృఢత్వం అవసరమని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 200 మంది సిబ్బందికి వివిధ రకాల పరీక్షలు చేశారు. విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించి ఫిట్‌గా ఉండాలని కోరారు.

News March 10, 2026

12pm-4pm పనులు రీషెడ్యూల్ చేసుకోండి: అనిత

image

AP: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. 12pm-4pm మధ్య బహిరంగ ప్రదేశాల్లో పనులుంటే రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. APSDMA, RTGS నుంచి ఎప్పటికప్పుడు వడగాల్పుల హెచ్చరికలు చేరవేయాలని ఆ విభాగాల అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు. వడదెబ్బ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.

News March 10, 2026

ANU: రేపటి నుంచి BED ప్రయోగ పరీక్షలు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బుధవారం నుంచి BED మొదటి విడత ప్రయోగ పరీక్షలు ప్రారంభమవుతాయని PG, వృత్తి విద్య కోర్సుల సమన్వయకర్త సుబ్బారావు మంగళవారం తెలిపారు. ఇవి 13 వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుగుతాయని చెప్పారు. మొత్తం 17కళాశాలల విద్యార్థులకు దగ్గరలోని పాఠశాలల్లో ప్రయోగ పరీక్షలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.