News November 7, 2025
పనులు మరింత వేగవంతంగా సాగాలి: హనుమకొండ కలెక్టర్

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి మరింత వేగవంతంగా సాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ, ఆర్డీఓ, మెప్మా, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి,ఇంకా ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 22, 2026
MNCL: రూమ్మేట్స్ మధ్య గొడవ.. ఒకరి మృతి

స్నేహితుల మధ్య జరిగిన గొడవలో దీపక్ అనే యువకుడు దాడికి గురై శనివారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. కూలి పని చేసుకునే సిడం దీపక్, భీముని సంజీవ్, దీపక్ కాలేజీ రోడ్డులో అద్దెకు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం వారి మధ్య జరిగిన గొడవలో దీపక్ పై రాడ్‌తో దాడి చేయడంతో గాయాలపాలయ్యాడు. ఘటనపై కేసు నమోదు పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
News March 22, 2026
నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్ ప్రజా భవన్ నుంచి బయలుదేరి 11 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మధ్యాహ్నం 4 గంటల వరకు పాల్గొంటారు. అనంతరం 4:30 గంటలకు తిరిగి బయలుదేరి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని ఆయన ఆయన వ్యక్తిగత సహాయకులు భాస్కర శర్మ తెలిపారు.
News March 22, 2026
రాష్ట్రంలో 198 ఉద్యోగాలు.. ఎల్లుండి హాల్‌టికెట్లు

TGSRTCలో 198 సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు హాల్‌టికెట్లను సోమవారం ఉ.8గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. https://www.tgprb.in/లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఉద్యోగాలకు దాదాపు 26వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ నెల 29న 10AM-1PM వరకు ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు, 2.30PM-5.30PM వరకు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.


