News November 7, 2025

నూతనకల్: యాక్సిడెంట్‌లో ఒకరు మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నూతనకల్ మండల పరిధిలోని ఎర్రపహాడ్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. పెదనేమిల గ్రామానికి చెందిన కాసోజు మురళి, జంగం లాజర్ పోలుమల్ల నుంచి బైక్‌పై పెదనేమిల వెళ్తుండగా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మురళీ, లాజర్ తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్‌కు తరలించగా మురళి మృతి చెందాడు.

Similar News

News November 8, 2025

సంజాపూర్‌ హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్

image

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సంజాపూర్ గ్రామంలో హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ నాగార్జున శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన జంగయ్య, అతని భార్య అలివేల, కొడుకు రమేష్‌పై ఆరుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.

News November 8, 2025

కీలక పోరు.. సూర్య రాణిస్తారా?

image

AUS-IND మధ్య బ్రిస్బేన్ వేదికగా ఇవాళ ఆఖరి T20 జరగనుంది. భారత్ సిరీస్ కైవసం చేసుకోవాలంటే ఈ మ్యాచులో గెలిచి తీరాల్సిందే. ఈ కీలక పోరులో కెప్టెన్ సూర్య, తిలక్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచులో భారత్ పలు మార్పులు చేసే ఛాన్సుంది. గిల్ స్థానంలో శాంసన్‌, దూబే స్థానంలో నితీశ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ 1:45PMకి ప్రారంభమవుతుంది. కాగా ఐదు T20ల సిరీస్‌లో IND 2-1తో ఆధిక్యంలో ఉంది.

News November 8, 2025

ప్రతి ఆటంకాన్ని తొలగించే వ్రతం ఇదే..

image

సంకటహర గణపతి వ్రతం ప్రతి ఆటంకాన్ని తొలగిస్తుందని పండితులు చెబుతారు. ఈ వ్రతం చేస్తే ఆర్థిక, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, సంతాన లేమి, విద్యవ్యాపారాల్లో వెనకబాటు తనం వంటి సమస్యలు పరిష్కారమవుతాయని అంటారు. ‘నర దృష్టి, శత్రు పీడల నుంచి ఈ వ్రతం రక్షణ కల్పిస్తుంది. వివాహం ఆలస్యం కావడం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవడం వంటి సమస్యలు కూడా తీరుతాయి. ఈ వ్రతాన్ని ఒకసారి చేసినా ఫలితం ఉంటుంది’ అని నమ్మకం.