News November 7, 2025
హనుమకొండ: MURDER అటెంప్ట్ కేసు.. టీచర్‌కు జైలు

ఉపాధ్యాయుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ముల్కనూర్ ఎస్ఐ రాజు తెలిపిన వివరాలు.. హసన్‌పర్తి(M) నాగారానికి చెందిన బానును హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న స్టాలిన్ ఇటీవల హత్య చేసేందుకు యత్నించాడు. బాను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరిపి, స్టాలిన్‌ను కోర్టు ఎదుట హాజరు పరిచారు. శుక్రవారం అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా జైలుకు తరలించారు.
Similar News
News November 8, 2025
సంజాపూర్ హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సంజాపూర్ గ్రామంలో హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ నాగార్జున శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన జంగయ్య, అతని భార్య అలివేల, కొడుకు రమేష్‌పై ఆరుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.
News November 8, 2025
కీలక పోరు.. సూర్య రాణిస్తారా?

AUS-IND మధ్య బ్రిస్బేన్ వేదికగా ఇవాళ ఆఖరి T20 జరగనుంది. భారత్ సిరీస్ కైవసం చేసుకోవాలంటే ఈ మ్యాచులో గెలిచి తీరాల్సిందే. ఈ కీలక పోరులో కెప్టెన్ సూర్య, తిలక్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచులో భారత్ పలు మార్పులు చేసే ఛాన్సుంది. గిల్ స్థానంలో శాంసన్, దూబే స్థానంలో నితీశ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ 1:45PMకి ప్రారంభమవుతుంది. కాగా ఐదు T20ల సిరీస్‌లో IND 2-1తో ఆధిక్యంలో ఉంది.
News November 8, 2025
ప్రతి ఆటంకాన్ని తొలగించే వ్రతం ఇదే..

సంకటహర గణపతి వ్రతం ప్రతి ఆటంకాన్ని తొలగిస్తుందని పండితులు చెబుతారు. ఈ వ్రతం చేస్తే ఆర్థిక, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, సంతాన లేమి, విద్యవ్యాపారాల్లో వెనకబాటు తనం వంటి సమస్యలు పరిష్కారమవుతాయని అంటారు. ‘నర దృష్టి, శత్రు పీడల నుంచి ఈ వ్రతం రక్షణ కల్పిస్తుంది. వివాహం ఆలస్యం కావడం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవడం వంటి సమస్యలు కూడా తీరుతాయి. ఈ వ్రతాన్ని ఒకసారి చేసినా ఫలితం ఉంటుంది’ అని నమ్మకం.


