News November 7, 2025

రామగుండం కమిషనరేట్‌లో వందేమాతరం గీతాలాపన

image

రామగుండం కమిషనరేట్‌లో వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ హాజరై అధికారులు, సిబ్బందితో కలిసి గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీ ప్రతాప్‌తోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News March 29, 2026

బుద్ధి లేనివాడు ఎలాంటి మాటలు చెబుతాడు?

image

అల్పుడెపుడుబల్కు నాడంబురముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తక్కువ విలువ ఉండే కంచుకు వచ్చినంత శబ్ధం విలువైన బంగారానికి రాదు. అలాగే తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెబుతూ ఉంటాడు. మంచి ప్రవర్తన గల వ్యక్తి శాంతంగా, సున్నితంగా మాట్లాడతాడు.
<<-se>>#PADHYAM<<>>

News March 29, 2026

‘ఫైర్‌తో ఆడేశాం’.. SRHపై RCB ట్రోల్స్

image

నిన్నటి SRH vs RCB మ్యాచ్‌తో మళ్లీ IPLలో ఫ్రాంచైజీల మధ్య ట్రోల్స్ సందడి మొదలైంది. ‘ప్లే విత్ ఫైర్’ అని మ్యాచ్‌కు ముందు ఎలివేషన్ ఇచ్చిన SRHను ఓడించడంతో RCB ‘ప్లేయిడ్ విత్ ఫైర్’ అని కౌంటర్ ఇచ్చింది. కోహ్లీ ఛేజింగ్‌ను ఆరెంజ్ జెర్సీలో చూస్తే ఇంకా మజా ఉంటుందని మరో పోస్ట్ పెట్టింది. ఇక కోహ్లీ కొట్టిన ఓ సిక్స్‌కు ‘ఏం షాట్ రా మామా’ అని క్యాప్షన్ పెట్టింది.

News March 29, 2026

విశాఖ: రైల్వే ప్రయాణికులకు గమనిక..!

image

విశాఖ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే సమతా ఎక్స్‌ప్రెస్(12807/12808)ను APRలో కొన్నిరోజులు రద్దు చేశారు. గోండియా స్టేషన్‌లో పనుల కారణంగా, రైలు సర్వీసులను క్యాన్సిల్ చేశారు. APR 5, 7, 8, 9, 11, 12, 14, 15, 16, 18, 19, 21, 22, 23 తేదీలలో విశాఖ నుంచి నిజాముద్దీన్ వెళ్లే రైళ్లను.. APR 7, 9, 10, 11, 13, 14, 16, 17, 18, 20, 21, 23, 24, 25 తేదీలలో హజరత్ నిజాముద్దీన్ నుంచి విశాఖ వచ్చే రైళ్లను రద్దు చేశారు.