News November 7, 2025

రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో CBN

image

సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పార్టీ కార్యాలయంలోనే ఉండనున్నారు. కాగా గత వారం పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన సమయంలో ఇక ప్రతివారం ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Similar News

News March 24, 2026

కక్ష ఉంటే నాపై తీర్చుకోండి: KTR

image

TG: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు అని KTR అన్నారు. ACB <<19460633>>ఛార్జ్‌షీట్‌పై<<>> ఆయన స్పందించారు. ‘ఈ-కార్ రేసులో నిధుల దుర్వినియోగం జరగలేదు. బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరిగాయి. తప్పు చేయని అధికారులను ఎందుకు ఇరికించారు. కక్ష ఉంటే నాపై తీర్చుకోండి’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందిస్తూ ‘లొట్టపీసు కేసు అయితే భయమెందుకు? ధైర్యంగా ఎదుర్కోవాలి’ అని కౌంటరిచ్చారు.

News March 24, 2026

క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: కలెక్టర్

image

జిల్లాను టీబీ రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో 21 పంచాయతీలను టీబీ ముక్తి జీపీలుగా గుర్తించామన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, లక్ష్య సాధనలో ముందున్న పీహెచ్‌సీలకు రూ. లక్ష చొప్పున ప్రోత్సాహకాలు ప్రకటించారు.

News March 24, 2026

అనకాపల్లి: రాగల 5 రోజుల్లో తేలిక పాటి వర్షాలు

image

రాగల 5 రోజులలో అనకాపల్లి జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా.సీహెచ్ ముకుందరావు తెలిపారు. మంగళవారం అనకాపల్లిలోని పరిశోధనా కేంద్రంలో ఆయన వాతావరణ వివరాలను వెల్లడించారు. 5రోజులు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.9 నుంచి 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 23.0 నుంచి 23.9 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని తెలిపారు.