News November 7, 2025

గోదావరిఖని ఆసుపత్రి సిబ్బందికి కలెక్టర్ అభినందనలు

image

గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందించారు. అక్టోబర్ నెలలో 240 ప్రసవాలు విజయవంతంగా నిర్వహించిన బృందాన్ని ఆయన సన్మానించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.

Similar News

News March 13, 2026

HYD: ఫ్యాన్సీ నంబర్లతో భారీగా ఆదాయం

image

ఖైరతాబాద్ RTA కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకొనేందుకే వాహనదారులు పోటీ పడ్డారు. TG 09 L 0009ను రూ.10,50,000కు, TG 09 L 0007కు రూ.3,19,999, TG 09 L 0005ను రూ.2,00,005కు, TG 09 K 9999ను రూ.1.5 లక్షలకు, TG 09 L 0024ను రూ.1.24 లక్షలకు, TG 09 L 0001ను రూ.లక్షకు దక్కించుకున్నారు. ఈ నంబర్లతో RTA ఆఫీస్‌కు రూ.31,14,730 ఆదాయం వచ్చింది.

ఖమ్మం: మెరుపు దాడులు.. 20 సిలిండర్లు సీజ్..!

image

ఖమ్మం నగరంలోని పలు హోటళ్లు, బిర్యానీ పాయింట్లపై సివిల్ సప్లై అధికారులు గురువారం మెరుపు దాడులు చేశారు. కొందరు దుకాణాల యజమానులు గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించి 20 సిలిండర్లను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6 కేసులు నమోదు చేసినట్లు DSO చందన్ కుమార్ తెలిపారు.
సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.