News November 7, 2025

GDK పట్టణంలో స్కౌట్& గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం

image

గోదావరిఖని RCOA క్లబ్ సమీపంలోని బైడన్ పావెల్ పార్క్ వద్ద భారత్ స్కౌట్& గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ అధికార ప్రతినిధి ముప్పిడి రవీందర్ రెడ్డి పాల్గొని జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో స్కౌట్స్& గైడ్స్ ఎనలేని సేవ చేస్తుందని కొనియాడారు. మాస్టర్ బుచ్చయ్య, దేవేందర్, కుమార్, స్వర్ణలత, లక్ష్మీ కుమారి, రాజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Similar News

News March 19, 2026

సిక్కోలులో సైబర్ మోసం

image

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సైబర్ మోసం ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అరసవల్లిలో నివాసం ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కె.జయశంకర్, భార్య పుష్పలత ఖాతా నుంచి రూ.2.49 లక్షలు మాయమయ్యాయి. బాధితులు వివరాలు మేరకు ఈనెల 11వ తేదీ రాత్రి బ్యాంకు లావాదేవీల యాప్‌కు సంబంధించి తమ మొబైల్‌కు వచ్చిన ఒక లింక్‌ను క్లిక్ చేయడంతో నగదు డెబిట్ అయినట్లు సందేశాలు రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

News March 19, 2026

కవిటి: మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

image

కవిటి మండలం నెలవంక పంచాయతీ పరిధిలోని ఒక గ్రామంలో ఉంటున్న ఒక మానసిక వికలాంగురాలిపై నెలవంక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు వారం రోజుల క్రితం ఆ గ్రామానికి వెళ్లిన వ్యక్తి మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు కవిటి పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 19, 2026

కామారెడ్డి: రైతు మహోత్సవానికి హాజరు కావాలి

image

ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు మహోత్సవానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కావాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. వ్యవసాయ, ఉద్యానవన రంగాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.