News November 8, 2025

సిరిసిల్ల: ‘నిబంధనలకు అనుగుణంగా సీఎంఆర్ సరఫరా చేయాలి’

image

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గడ్డం నగేష్ ఆదేశించారు. సీఎంఆర్ సరఫరా, ఖరీఫ్ ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారెంటీ వంటి అంశాలపై ఆయన శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో రా రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేటాయించిన ధాన్యం, ఎఫ్‌సీఐకి ఇచ్చిన బియ్యం వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు.

Similar News

News March 14, 2026

సిరిసిల్ల: 8 మంది విద్యార్థులు గైర్హాజరు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో SSC పబ్లిక్ పరీక్షలు మొదటిరోజున ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 34 పరీక్షా కేంద్రాలలో 7307 మంది విద్యార్థులకు గాను 7299 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కన్నారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.

News March 14, 2026

NZB: ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు.. 51 మంది గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్షకు మొత్తం 24,404 మంది విద్యార్థులకు గాను 24,353 మంది హాజరైనట్లు డీఈవో అశోక్ తెలిపారు. వివిధ కారణాలతో 51 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని డీఈవో స్పష్టం చేశారు.

News March 14, 2026

KNR: శాతవాహన వర్శిటీ పరిధిలో 23 నుంచి ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌ఎల్‌ఎం (పీజీ) మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్ట‌ర్‌ డి.సురేశ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనల కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు.