News November 8, 2025
జగిత్యాల: ‘యువత అన్ని రంగాల్లో రాణించాలి’

యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో జిల్లాలోని అన్ని గ్రామాలకు చెందిన 350 మంది యువత వివిధ అంశాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ రఘువరన్, డీఈవో రాము, జిల్లా క్రీడా శాఖ అధికారి రవికుమార్, విశ్వప్రసాద్, బొడ్డు రాజేష్ పాల్గొన్నారు.
Similar News
News March 9, 2026
విమానాశ్రయం ద్వారా నేడు ఎంతమంది ప్రయాణించారంటే..!

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా సోమవారం 40 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 20 సర్వీసుల ద్వారా 1,836 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 2,111 మంది 20 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.
News March 9, 2026
HYD స్టేడియాలకు మహర్దశ.. లిస్టులో ఇవే!

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News March 9, 2026
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ మాకవరపాలెంలో పరిశ్రమలు ఏర్పాటుకు 4259 ఎకరాల భూమి సేకరణకు స్థల పరిశీలన
➤ గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష
➤ బాలుడి మృతికి నాటు తుపాకీ పేలుడే కారణం
➤ అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు: ఎస్పీ
➤ పుత్తడి గైరంపేటలో గుండెపోటుతో యువకుడు మృతి
➤ శృంగవరంలో పర్యటించిన కేంద్ర బృందం
➤ ఎరకన్నపాలెం టూ పెద్దపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లతో ప్రతిపాదనలు
➤PGRS లో ఫిర్యాదుల వెల్లువ


