News November 8, 2025
అమరావతి నిర్మాణానికి రూ.7,500 కోట్ల ఆర్థిక సహకారం

రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 7,500 కోట్ల ఆర్థిక సహకారం అందించేందుకు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(NaBFID) ముందుకొచ్చింది. శుక్రవారం బ్యాంకు ఉన్నతాధికారులు సామ్యూల్ జోసెఫ్, దినేష్‌లు..సీఎం చంద్రబాబు సమక్షంలో CRDA కమిషనర్ కె.కన్నబాబుకు సంబంధిత పత్రాలు అందజేశారు. NaBFID అందజేసిన నిధులు అమరావతి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు వినియోగిస్తామని కమిషనర్ తెలిపారు.
Similar News
News March 18, 2026
బాపట్ల: ‘LPG.. వేల బుకింగ్స్ పెండింగ్’

బాపట్ల జిల్లాలో LPG సిలిండర్ల సరఫరాపై జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాలో 7,516 సిలిండర్లు నిల్వలో ఉన్నాయని తెలిపారు. మంగళవారం నాటికి 5,829 సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇంకా 52,776 బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ, సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News March 18, 2026
ASF: వివాహేతర సంబంధం.. గర్భిణి హత్య

వివాహేతర సంబంధం ఓ యువతి ప్రాణం తీసింది. పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన ఆత్రం <<19399280>>సమ్మక్క <<>>(25) జైహింద్‌పూర్‌కు చెందిన వివాహితుడు జలపతి మధ్య ప్రేమాయణం సాగింది. సమ్మక్క గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా, భార్యాపిల్లలున్న జలపతి ఆమెను వదిలించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలో జైహింద్‌పూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి బండరాయితో కొట్టి, గొంతునులిమి హత్య చేశాడు. కేసు నమోదైంది.
News March 18, 2026
GNT: సీఎం భద్రతా సిబ్బందికి పతకాలు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని CM చంద్రబాబు వ్యక్తిగత భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలకు ఎంపిక చేసింది. CM ప్రత్యేక రక్షణ అధికారి మధుసూదన్‌కు ‘మహోన్నత సేవా పతకం’, కాన్వాయ్ డ్రైవర్ గిరిబాబుకు ‘ఉత్తమ సేవా పతకం’ ప్రకటించింది. 2019 నుంచి మధుసూదన్ CM వద్ద సేవలు అందిస్తుండగా, గిరిబాబు గత 15ఏళ్లుగా చంద్రబాబు కాన్వాయ్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.


