News November 8, 2025
జగిత్యాల: ‘ర్యాలీని విజయవంతం చేయాలి’

తమ సమస్యల పరిష్కారం కోసం ముంబాయిలో ఈ నెల 17న నిర్వహిస్తున్న రిప్రెజెంటేటివ్స్ ర్యాలీని విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలని కోరారు. నాయకులు రాము, సునీల్, అరవింద్ పాల్గొన్నారు.
Similar News
News April 4, 2026
ఇందూరు: కుస్తీ పోటీల చరిత్ర తెలుసా..?

ఇందూరు గడ్డపై కుస్తీ పోటీలది దశాబ్దాల చరిత్ర. నైజాం కాలం నుంచే ఇక్కడ మల్లయుద్ధాలకు ప్రత్యేక ఆదరణ ఉండేది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జాతరలు, పండుగలు వచ్చాయంటే చాలు ఊరు వాడ ఏకమై అఖాడాల వద్ద వాలిపోయేవారు. బలాబలాల ప్రదర్శనను కేవలం క్రీడగానే కాకుండా, ఆత్మగౌరవ ప్రతీకగా భావించే సంప్రదాయం ఇక్కడ బలంగా నాటుకుపోయింది. నిజాముల ప్రోత్సాహంతో అనేక మంది పేరుమోసిన మల్లయోధులు ఇక్కడి నుంచే వెలుగులోకి వచ్చారు.
News April 4, 2026
జుట్టు చివర్లు చిట్లుతున్నాయా..?

వాతావరణ మార్పుల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లడం ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానానికి మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. బయటకి వెళ్తున్నప్పుడు జుట్టంతా కప్పిఉంచుకోవాలి. తలస్నానం తర్వాత హెయిర్ సీరం వాడటం మంచిది. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయినా సమస్య తగ్గకపోతే ఒకసారి ట్రైకాలజిస్ట్‌లను సంప్రదించాలి.
News April 4, 2026
6న కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేనా?

ఈ నెల 6వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతుల మీదుగా నల్గొండ, తిప్పర్తిలో వీటిని అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మిల్లర్లతో చర్చలు సఫలం కాకపోవడంతో 6వ తేదీన కొనుగోళ్లు ప్రారంభం అవుతాయా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. కొనుగోళ్లలో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


