News April 11, 2024

విశాఖ సూసైడ్ చేసుకున్న కానిస్టేబుల్‌ వివరాలు గుర్తింపు

image

విశాఖ ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో SPF కానిస్టేబుల్ శంకర్రావు గురువారం ఉదయం సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఐఓబీలో గన్‌మెన్‌గా పని చేసే ఇతని స్వగ్రామం రాజాం నియోజకవర్గంలోని వంగర మండలం కొట్టిస. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఉ. 5 గంటలకు డ్యూటీ‌కి హాజరైన శంకర్రావు తన వద్ద ఉన్న SLRతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 11, 2026

SKLM: ‘ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి’

image

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కెవి రమణ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలసలో ఉన్న పోలీస్ శిక్షణకేంద్రంలో ఆర్మడు రిజర్వుడ్ పోలీసులకు 14 రోజులుపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.

News March 10, 2026

శ్రీకాకుళం: ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం.. చివరికీ

image

శ్రీకాకుళం జిల్లాతో పాటు, పలు ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా బీబీనగర్‌కు చెందిన గొల్ల బెనర్జీ పలు చోట్ల ఉద్యోగాల పేరుతో రూ.1.05 కోట్లు వసూలు చేశాడన్నారు. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామన్నారు.

News March 10, 2026

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌పై ACB అదికారుల దాడి

image

శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో ACB అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ACB సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రావుతో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సంబంధించిన ఫైళ్లను, ఈ ఆఫీస్ ఫైళ్లను పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ శాఖలో అవినీతి ఆరోపణలు పెరిగిన నేపథ్యంలో ఏసీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫిర్యాదుల మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు.