News November 8, 2025

విశాఖ: ‘పెండింగ్‌లో ఉన్న నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు వేగవంతం’

image

దసరా, దీపావళి, GST సంస్కరణల సందర్భంగా ప్రజలు వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేశారు. ఎక్కువ సంఖ్యలో వాహనాలు కొనుగోలు జరగడంతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పెండింగ్‌ వలన రవాణా శాఖ కార్యాలయంలో అదనపు సిబ్బందిని వినియోగించి వాహనాలకు శుక్రవారం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించామని DTC R.C.H.శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక నంబర్లు కొనుగోలు చేసిన వారికీ నంబర్లు కేటాయించిన వెంటనే వాటిని అప్రూవల్ చేస్తామన్నారు.

Similar News

News March 12, 2026

మధురవాడ: ఉరివేసుకుని యువకుడు మృతి!

image

మధురవాడ గణేష్ నగర్‌లో తాడి ప్రవీణ్ కుమార్ (27) అనే యువకుడు మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చింతపల్లికి చెందిన ప్రవీణ్ గత ఆరేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తూ, స్థానిక టెలిఫోన్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 12, 2026

విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చర్లపల్లికి కొత్త సూపర్ ఫాస్ట్ రైలు!

image

రైల్వే ఆధునీకరణలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. కొక్రాఝర్ – చర్లపల్లి (05674) స్పెషల్ రైలు శనివారం సాయంత్రం పెందుర్తి (17:58), దువ్వాడ (19:30) స్టేషన్లకు చేరుకుంటుంది. 20 కోచ్‌లతో నడిచే ఈ అత్యాధునిక రైలు సామాన్య ప్రయాణికులకు హైదరాబాద్ వెళ్లేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది

News March 12, 2026

విశాఖ జిల్లాలో టెన్త్ పరీక్షలకు అంతా రెడీ

image

ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు విశాఖ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 133 పరీక్షా కేంద్రాల్లో 28,983 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 456 స్కూల్స్ నుంచి విద్యార్థులు హాజరవుతున్నారు. 8 స్కూల్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్స్ స్క్వాడ్స్ పర్యవేక్షణ చేయనున్నాయి.