News November 8, 2025
ఘాట్ రోడ్డులో దగ్ధమైన బస్సును పరిశీలించిన అధికారులు

పాచిపెంట మండలం పి.కొనవలసలో ఆంధ్ర-ఒడిశా ఘాట్ రోడ్డులో దగ్ధమైన ఒడిశా ఆర్టీసీ బస్సును సాలూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బి.ఎల్.ఎన్.వి ప్రసాద్‌తో పాటు ఒడిశా అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఇంజిన్ సాంకేతిక కారణంగా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వలన మంటలు రావడం జరిగిందని గుర్తించామన్నారు. బస్సు పూర్తిగా దగ్దమయ్యిందని అధికారులు తెలిపారు.
Similar News
News March 28, 2026
కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 30న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, మెకానికల్ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని అన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్‌తో ఆరోజు ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8639846568 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
News March 28, 2026
వరంగల్: ఎటు పోయాయో ఆ పల్లె జ్ఞాపకాలు..!

ఒకప్పుడు వేసవి వస్తే ఓరుగల్లు పల్లెలు చుట్టాలతో కళకళలాడేవి. పొలంకాడి చింత చెట్టు కాయలు తెంపి, ఇసుర్రాయిపై పొయ్యి గొట్టంతో గింజలు తీస్తూ ముచ్చటించుకునే ఆ రోజులు ఇప్పుడు కలగా మారాయి. మోదుగు ఆకులతో ఇస్తార్లు కుట్టడం, మట్టి పొయ్యిలు, నులక మంచాలు యాంత్రీకరణలో కొట్టుకుపోయాయి. నాటి బాల్యం ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. పట్నంలో పని చేస్తూ నాటి మధుర జ్ఞాపకాలను మీరు మిస్ అవుతున్నారా? కామెంట్ చేయండి.
SHARE
News March 28, 2026
రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం.. చెక్ చేసుకోండి!

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు కేంద్రం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అమలుచేస్తోంది. దీనిద్వారా అర్హులైన ప్రతి కుటుంబం ఏడాదికి రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. అయితే దీనికి అర్హులో కాదో చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలని కేంద్రం సూచించింది. <


