News November 8, 2025

విజయవాడ: జాబ్ మేళాలో 451 మందికి ఉద్యోగాలు

image

SRR కళాశాలలో APSSDC ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో 451 మందికి ఉద్యోగాలు లభించాయని ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాస్ తెలిపారు. జాబ్ మేళాకు 1,219 మంది హాజరవ్వగా 451 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, మరో 292 మంది ఇంటర్వ్యూలోని తదుపరి రౌండ్లకు ఎంపికయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ ఆఫర్ లెటర్లు అందించారని ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News March 4, 2026

టీచర్ల జీతాలను ప్రభుత్వం తగ్గించదు: KK

image

TG: ప్రభుత్వ టీచర్ల జీతాలు తగ్గించాలంటూ విద్యాకమిషన్ సర్కారుకు నివేదిక ఇచ్చిందన్న వార్తలపై ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ కే.కేశవరావు స్పందించారు. ప్రభుత్వం టీచర్ల జీతాలను తగ్గించదని స్పష్టం చేశారు. శాలరీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఉపాధ్యాయ సంఘాలను పిలిచి మాట్లాడుతామని చెప్పారు. అన్ని జీవోలు పబ్లిక్ డొమైన్‌లో పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నెల రోజుల్లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తెస్తుందని వివరించారు.

News March 4, 2026

తిరుపతి కలెక్టర్‌ను కలిసిన ఖాదీ బోర్డు ఛైర్మన్

image

తిరుపతి కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌ను ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కెకె చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణపై చర్చించినట్లు సమాచారం. జిల్లా అభివృద్ధికి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని వారు అభిప్రాయపడ్డారు.

News March 4, 2026

నిర్మల్‌లో వందరోజుల కార్యక్రమం ప్రారంభం

image

బాల్యవివాహాల నిర్మూలనకు జిల్లా యంత్రాంగం 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించాలని ఉద్దేశంతో బాల్య వివాహ రహిత భారత్ కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులు ప్రచార రథం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలు విద్యాసంస్థలలో విస్తృత అవగాహన కల్పించనున్నారు. 18,21 సంవత్సరాలు లోపు బాల బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని జరిగే పరిణామాలను వివరించనున్నారు.