News November 8, 2025

నర్సాపూర్ (జి): ఫిడే వరల్డ్ చెస్ కప్-2025 ఆర్బిటర్‌గా అరుణ్ కుమార్

image

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) గ్రామ వాసి గాడి అరుణ్ కుమార్ ఫిడే వరల్డ్ చెస్ కప్ -2025కి ఆర్బిటర్‌గా(నిర్ణేత) ఎంపికయ్యారు. గోవాలో నవంబర్ 27 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక చెస్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 83 దేశాల నుంచి 206 మంది ఆటగాళ్లు పాల్గొనే మెగా ఈవెంట్‌కు ఆర్బిటర్‌గా అరుణ్ కుమార్ ఎంపిక కావడం నిర్మల్ జిల్లాకే గర్వకారణమని మండల వాసులు అభినందిస్తున్నారు.

Similar News

News November 8, 2025

KNR: విద్యార్థులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన

image

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా KNR జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారి భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించి సవివరంగా వివరించారు.

News November 8, 2025

హిడ్మాను పట్టుకునేందుకు పక్కా ప్లాన్

image

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాను పట్టుకునేందుకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు పక్కా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణకు ఆనుకుని ఉన్న ఆ రాష్ట్ర సరిహద్దుల్లో 2 వేల మంది జవాన్లతో చుట్టుముట్టారు. డ్రోన్లతో నిఘా పెట్టారు. మ్యాపింగ్, థర్మల్ ఇమేజింగ్ లాంటి అత్యాధునిక టెక్నాలజీతో అబూజ్‌మడ్ అడవులను జల్లెడ పడుతున్నారు. బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

News November 8, 2025

నేడు హైదరాబాదులో వేములవాడ రాజన్న కళ్యాణం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం శనివారం సాయంత్రం హైదరాబాదులోని ఎన్టీఆర్ గార్డెన్స్ లో నిర్వహించనున్నారు. భక్తి టీవీ వారు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా గత 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల కళ్యాణాన్ని హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీ స్వామివారి కళ్యాణం చేయనున్నారు.