News November 8, 2025

అసోసియేషన్ల తీరుతో నష్టపోతున్న క్రీడాకారులు!

image

AP: ఇటీవల DSCలో స్పోర్ట్స్‌ కోటా కింద కొందరు ఉద్యోగానికి అనర్హులయ్యారు. గుర్తింపులేని అసోసియేషన్లతోనే క్రీడాకారులు నష్టపోతున్నారని శాప్ తెలిపింది. APలో మొత్తం 63 స్పోర్ట్స్‌ అసోసియేషన్లు ఉండగా.. అందులో శాప్ గుర్తించినవి 35 మాత్రమే. గుర్తింపులేని వాటి తరఫున సర్టిఫికెట్లు సాధించినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఈ విషయం ముందే తెలుసుకుని గుర్తింపులేని అసోసియేషన్ల తరఫున ఆడొద్దని సూచిస్తున్నారు.

Similar News

News November 8, 2025

ఆలయాల్లో డిజిటల్ సేవలు.. 100 కియోస్క్‌ల ఏర్పాటు

image

AP: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో డిజిటల్ సేవలను పెంచాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. దర్శనం, సేవల టికెట్లను సులభంగా పొందేలా 100 కియోస్క్‌లను ఏర్పాటుచేయనుంది. దీనివల్ల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గనుంది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తితోపాటు అరసవిల్లి, మహానంది, కసాపురం, కదిరి లక్ష్మీనరసింహస్వామి తదితర 15 ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.

News November 8, 2025

ఈ స్నాక్స్ ట్రై చేయండి

image

పిల్లలు స్కూల్లో, పెద్దలు ఆఫీసుల్లో తినడానికి బెస్ట్ స్నాక్స్
*వేయించిన శనగలు
*బాదాం లేదా వాల్‌నట్స్
*ఆపిల్ లేదా జామ
*డార్క్ చాక్లెట్లు
*హోం మేడ్ ప్రొటీన్ లడ్డూ
*గుమ్మడి, అవిసె, చియా సీడ్స్
*ఉడకబెట్టిన గుడ్డు

News November 8, 2025

భారత్‌ని టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

image

పాక్‌తో సంబంధమున్న ‘ట్రాన్స్‌పరెంట్ ట్రైబ్’ అనే హ్యాకర్స్ గ్రూప్ భారత్‌ని టార్గెట్‌ చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ‘డెస్క్ ర్యాట్’ అనే అడ్వాన్స్డ్ స్పై వేర్‌తో ప్రభుత్వం, ఆర్మీ కంప్యూటర్స్‌ని అటాక్ చేస్తున్నట్లు తెలిపాయి. భారత కంప్యూటర్ల ద్వారా చైనా మిలిటరీ కదలికలు చూసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపాయి. నకిలీ ఈమెయిల్స్‌తో స్పైవేర్ ఇన్‌స్టాల్ చేసుకునేలా ట్రాప్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.