News November 8, 2025

రామారెడ్డి: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

image

ఆన్‌లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాలిలా..రామారెడ్డి (M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ. 1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోస పోయినట్లు తెలిసి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు SI వివరించారు.

Similar News

News November 8, 2025

ఆలయాల్లో డిజిటల్ సేవలు.. 100 కియోస్క్‌ల ఏర్పాటు

image

AP: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో డిజిటల్ సేవలను పెంచాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. దర్శనం, సేవల టికెట్లను సులభంగా పొందేలా 100 కియోస్క్‌లను ఏర్పాటుచేయనుంది. దీనివల్ల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గనుంది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తితోపాటు అరసవిల్లి, మహానంది, కసాపురం, కదిరి లక్ష్మీనరసింహస్వామి తదితర 15 ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.

News November 8, 2025

రాజమండ్రి: తుఫాను పంట నష్టం అంచనాలు పూర్తి

image

తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల సంభవించిన మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టం అంచనా ప్రక్రియ పూర్తయినట్లు డీఏఓ మాధవరావు శుక్రవారం వెల్లడించారు. మొత్తం 14,602 హెక్టార్లలో వరి, 1,135 హెక్టార్లలో మినుము పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరికి ఎకరాకు రూ.25 వేలు, మినుముకు ఎకరాకు రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.38 కోట్లకు పైగా పరిహారాన్ని రైతులకు చెల్లించనున్నట్లు ఆయన వివరించారు.

News November 8, 2025

నెల్లూరులో కీలక సమావేశం.. MLAలు ఏమంటారో?

image

కనుపూరు, గండిపాలెం, స్వర్ణముఖి బ్యారేజి, రాళ్లపాడుతో పాటు సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలకు సాగునీటి విడుదల చేయాల్సి ఉంది. ఆయా కాలువల్లో గుర్రపు డెక్క తీయలేదు. పెన్నా పొర్లు కట్టల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేజర్ల, అనంత సాగరం, ఆత్మకూరులో రూ.18198 కోట్ల పనులకు అనుమతులు రాలేదు. డేగపూడి, బండేపల్లి కెనాల్ భూసేకరణ పెండింగ్ ఉంది. నెల్లూరులో నేడు జరిగే IAB సమావేశంలో MLAలు వీటిపై ఫోకస్ చేయాల్సి ఉంది.