News November 8, 2025

సంజాపూర్‌ హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్

image

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సంజాపూర్ గ్రామంలో హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ నాగార్జున శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన జంగయ్య, అతని భార్య అలివేల, కొడుకు రమేష్‌పై ఆరుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.

Similar News

News March 7, 2026

శ్రీలంక పర్యటనకు గద్వాల క్రికెటర్ ఎంపిక

image

గద్వాలకు చెందిన క్రికెటర్ టి.అరుణ్ కుమార్ శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యారు. మార్చి 15 నుంచి శ్రీలంకలో జరగనున్న సిరీస్‌లో ఆయన ఆడనున్నారు. ఈ సందర్భంగా శనివారం MLA కృష్ణమోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అరుణ్ కుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. గద్వాల ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో వెలగడం గర్వకారణమని MLA పేర్కొన్నారు. HCA జిల్లా జట్టులో రాణిస్తున్న అరుణ్ కుమార్ తన ప్రతిభతో సిరీస్‌కు ఎంపికయ్యారు.

News March 7, 2026

విజయ్‌‌కి భార్య షాక్.. కోర్టులో మరో పిటిషన్!

image

టీవీకే అధినేత విజయ్‌కి ఆయన భార్య సంగీత <<19295692>>మరోసారి<<>> షాక్ ఇచ్చారు. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె మరో పిటిషన్ దాఖలు చేశారు. తమ విడాకుల కేసు ముగిసే వరకు తాను విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతివ్వాలని అందులో కోరారు. ‘చెన్నై నీలంకరైలోని ఇంట్లో నాకూ సగం వాటా ఉంది. విడాకుల కేసు ముగిసే వరకు, నేను వేరే ఇంటికి మారే వరకు అక్కడ ఉండేందుకు అనుమతించాలి’ అని తన పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది.

News March 7, 2026

సుప్రీంలీడర్‌ను ఇరాన్ కావాలనే ప్రకటించట్లేదా?

image

ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఖమేనీ కొడుకు మొజ్తాబాను నియమించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వాటిలో <<19297127>>నిజం లేదని<<>> అక్కడి ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలో సుప్రీంలీడర్ నియామకంపై ఇరాన్ కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొజ్తాబాను ప్రకటిస్తే చంపేస్తారనే భయంతో సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఎవరిని ఎన్నుకున్నా అంతం చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించడం, కొత్తగా <<19290160>>బాధ్యతలు చేపట్టిన<<>> పలువురిని చంపడం తెలిసిందే.