News November 8, 2025

జయప్రకాశ్ రెడ్డి హత్య కేసులో తల్లి హస్తం?

image

బి.కొత్తకోట మండలంలో <<18222445>>దారుణహత్య<<>>కు గురైన జయప్రకాశ్ రెడ్డి హత్యకేసులో తల్లి హస్తం ఉన్నట్లు సమాచారం. గోళ్లతోపు గ్రామం గుడివారిపల్లికి చెందిన జయప్రకాష్ రెడ్డి(25) శుక్రవారం ఊరికి సమీపంలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహీంద్ర ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలతో హత్య వేనుక తల్లి ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్నారు.

Similar News

News March 8, 2026

నిర్మల్: ‘ప్రజాపాలన’లో 341 ఫైళ్ల పరిష్కారం..!

image

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్మల్ జిల్లాలో పారిశుద్ధ్య, ఫైళ్ల పరిష్కార డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజా నివేదిక ప్రకారం.. జిల్లావ్యాప్తంగా ఏకంగా 48,673 కిలోల ఘన వ్యర్థాలను అధికారులు తొలగించారు. 1,044 ప్రభుత్వ కార్యాలయ భవనాలను శుభ్రం చేశారు. అంతేకాకుండా, పరిపాలనను వేగవంతం చేస్తూ పెండింగ్‌లో ఉన్న 341 ఫైళ్లను ఒకేరోజు పరిష్కరించారు.

News March 8, 2026

సెక్షన్ 22-A, డాటెడ్ లాండ్స్ అభ్యర్థనలపై కలెక్టర్ సమీక్ష

image

పుట్టపర్తి కలెక్టరేట్‌లో రెవెన్యూ విభాగానికి సంబంధించిన సెక్షన్ 22-A నిషేధిత భూముల జాబితా శుద్ధి, డాటెడ్ లాండ్స్ అభ్యర్థనలపై కలెక్టర్ శ్యాంప్రసాద్ శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో 22-A మార్పులకు 453 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అదేవిదంగా డాటెడ్ లాండ్స్‌కు సంబంధించి 281 అభ్యర్థనలు అందగా, వాటిలో ఎక్కువ అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు.

News March 8, 2026

ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు లేదు: SPDCL CMD

image

TG: ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు ఉండదని SPDCL CMD జితేశ్.వి.పాటిల్ స్పష్టం చేశారు. SPDCL పరిధిలో మొత్తం 1.20 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని, గతేడాదితో పోలిస్తే 12.09L మంది పెరిగారని వెల్లడించారు. ‘గృహాజ్యోతి’ పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గిందన్నారు. ఈ ఏడాది FEB వరకు 5.44కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా, ప్రభుత్వం నుంచి రూ.1930.66కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చాయని తెలిపారు.