News November 8, 2025

కొత్తకోట వద్ద కారు, లారీ ఢీ.. సెక్రటరీ మృతి

image

గద్వాలలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా, కొత్తకోట వద్ద కారు ఆపగా.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ కారుపై బోల్తా పడింది. కారులో ఉన్న వేముల గ్రామ పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి తీవ్ర గాయాలై, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆ సమయంలో టాయిలెట్ కోసం కిందకు దిగిన ముగ్గురు సెక్రెటరీలు ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు.

Similar News

News March 22, 2026

పెరగనున్న విమానాల టికెట్ల ధరలు?

image

యుద్ధం నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విమాన టికెట్ల ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విమాన ఇంధన(ATF) ధరలూ ఎగబాకే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏప్రిల్ 1న వీటిని సవరిస్తుంటారు. దీంతో టికెట్లపై దాని ప్రభావం ఆ రోజునే తెలుస్తుందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ ఇటీవల అన్నారు. కాగా ఇప్పటికే కొన్ని ఎయిర్‌లైన్స్ సర్‌ఛార్జ్ పేరిట ప్రయాణికులపై భారం మోపుతున్నాయి.

News March 22, 2026

HYD: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా!

image

మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈనెల 13న దొడ్ల ప్రతాప్ గ్రూప్ డైరెక్టర్ దివ్యరెడ్డి అకౌంటెంట్‌కు వాట్సప్‌లో డబ్బులు పంపాలని మెసేజ్ వచ్చింది. డైరెక్టర్ దివ్యరెడ్డి ఫొటో డీపీ ఉండటంతో అకౌంటెంట్ దాంట్లో సూచించిన ఖాతాకు రూ.1.20 కోట్లు బదిలీ చేశారు. మరోసారి డబ్బులు పంపించాలని సూచించడంతో మోసం బయట పడింది. వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 22, 2026

SMలో నిందితుల దృశ్యాలు.. తప్పుపట్టిన సుప్రీంకోర్టు

image

నిందితుల ఫొటోలు, వీడియోలను ప్రజలు వెంటనే SMలో పోస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అలాగే సంకెళ్లు వేసిన, తాళ్లతో బంధించిన, మోకాళ్లపై కూర్చోబెట్టిన దృశ్యాలను పోలీసులే షేర్ చేయడం ఆ వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడమేనని పేర్కొంది. వీటి వల్ల పారదర్శక విచారణకు ముప్పు కలుగుతుందని తెలిపింది. ఇలాంటి వాటిని నియంత్రించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.