News April 11, 2024

‘రామాయణం’ కోసం రూ.75 కోట్ల రెమ్యునరేషన్!

image

నితేశ్ తివారీ తెరకెక్కించనున్న ‘రామాయణం’ సినిమాలో రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ కపూర్ రూ.75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే, సీత పాత్రలో నటించనున్న హీరోయిన్ సాయి పల్లవి రూ.6 కోట్లు తీసుకోనుండగా రాకింగ్ స్టార్ యశ్ ఏకంగా రూ.80 కోట్ల పారితోషికం తీసుకోనున్నట్లు సమాచారం. తాజాగా, రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ శిక్షణ తీసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.

Similar News

News March 17, 2026

ఈ జీవి పాలు నల్లగా ఉంటాయ్.. ఎందుకంటే?

image

సాధారణంగా ఏ జీవి పాలైనా తెలుపు రంగులో ఉంటాయి. కానీ ఖడ్గమృగం మాత్రం నల్లటి పాలు ఇస్తుంది. వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా(0.2%) ఉండటమే దీనికి కారణం. ఇతర జంతువుల పాలలో కొవ్వు ఎక్కువగా ఉండి తెల్లగా కనిపిస్తాయి. కానీ ఖడ్గమృగం పాలలో నీరు ఎక్కువగా ఉండి కొవ్వు తక్కువగా ఉండటంతో అవి నల్లగా ఉంటాయి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 17, 2026

IPLలో అత్యధిక పరుగుల వీరులు వీరే..

image

విరాట్ కోహ్లీ-8661 (267 మ్యాచులు)
రోహిత్ శర్మ- 7046 (272)
శిఖర్ ధవన్- 6769 (222)
డేవిడ్ వార్నర్- 6565 (184)
సురేశ్ రైనా- 5528 (205)
> మరి ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 9వేల మార్కును అందుకుంటారా? కామెంట్ చేయండి.

News March 17, 2026

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో DA హైక్?

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల DAను మార్చి చివరి లేదా ఏప్రిల్ తొలి వారంలో పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 58% DAను 60% లేదా 61%కి పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. AICPI డేటా ప్రకారం కనీసం 2% పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. గత 3 నెలల బకాయిలు కూడా ఒకేసారి అందే అవకాశం ఉంది. దీనివల్ల ‘బేసిక్ పే’ను బట్టి నెలకు రూ.వేలల్లో జీతం పెరగనుంది.