News November 8, 2025

GNT: సరిగ్గా 9 ఏళ్ల క్రితం అందరి మైండ్ బ్లాక్..!

image

2016 నవంబర్ 8న ప్రభుత్వం రూ.500, 1000 నోట్లను రద్దు చేయటం ఉమ్మడి గుంటూరు జిల్లాలను కుదిపేసింది. నూతన రాజధాని పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైన ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్, రాజధాని రాక కారణంగా ప్రజల్లో పెరిగిన లావాదేవీలపై నోట్ల రద్దు పెను ప్రభావాన్ని చూపించింది. ఆ సమయంలో ఇతర జిల్లాల్లో లక్షల్లో లావాదేవీలు జరిగితే ఇక్కడ కోట్లల్లో జరిగాయి. ఆ పరిణామం జిల్లా ప్రజలు ఎప్పటికీ మరువలేని. దీనిపై మీ COMMENT.

Similar News

News March 6, 2026

H1-B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

image

FY 2027కి సంబంధించిన H1-B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మార్చి 19 వరకు గడువు ఉంది. అయితే ఈసారి అమెరికా నిబంధనలను చాలా కఠినం చేసింది. విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకునే కంపెనీలు లక్ష డాలర్ల అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో కూడా ఎక్కువ శాలరీ, నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యం లభించేలా ‘వెయిటెడ్ సెలక్షన్’ పద్ధతి తెచ్చారు. సోషల్ మీడియా వెరిఫికేషన్ కూడా తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

News March 6, 2026

పులివెందుల సీఐగా శ్రీరామ్

image

గతంలో ప్రొద్దుటూరులో పనిచేసిన సీఐ శ్రీరామ్‌ను పులివెందుల సీఐగా బదిలీ చేస్తూ కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామిరెడ్డిని పులివెందుల టౌన్ నుంచి రూరల్‌కు, శాంతిలాల్‌ను కడప వీఆర్ నుంచి పులివెందుల ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. శంకర్ రెడ్డిని కడప RSTF నుంచి RK వ్యాలీకి, ఉలసయ్యను RK వ్యాలీ నుంచి కడప వీఆర్‌కు, హాజీవల్లీని పులివెందుల ట్రాఫిక్ నుంచి నంద్యాల DPTCకి బదిలీ చేశారు.

News March 6, 2026

HYD: మీ గుడి నుంచి పూజలు.. రూ.50 వేల ఆదాయం

image

ప్రముఖ ఆధ్యాత్మిక ప్లాట్‌ఫాం వేదమందిర్‌కు సేవలందించేందుకు పురోహితులు కావలెను. మీ ప్రాంతంలోనే ఉండి, మీ దైనందిన కార్యక్రమాలు చూసుకుంటూనే మా కస్టమర్లకు సేవలు అందించవచ్చు. దీంతో మీరు నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు పొందుతారు. ఆసక్తి గల పురోహితులు <>ఇక్కడ క్లిక్ <<>>చేసి మీ వివరాలు నమోదు చేయండి. మా ప్రతినిధులే మిమ్మల్ని సంప్రదిస్తారు.