News November 8, 2025
కరీంనగర్: రైతుల చూపులు.. ఆకాశం వైపు..!

ఉమ్మడి KNR జిల్లాలో వర్షాల మధ్య రైతుల ఆశలు తడిసి ముద్దవుతున్నాయి. చెమటోడ్చి పండించిన బంగారు ధాన్యం ఇప్పుడు ఆకాశం దయ మీద ఆధారపడి ఉంది. ఎండబెట్టిన క్రమంలో కురిసిన చినుకులు రైతు హృదయాన్ని తడుపుతున్నాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఆలస్యమవడంతో, పొలాల పక్కన పంటను ఎండబెట్టిన ప్రయత్నంలో రైతులు నిస్సహాయంగా మారారు. కష్టానికి కడుపు నిండే ఫలితం దక్కుతుందా లేదా అనే ఆందోళనలో రైతుల చూపులు ఆకాశం వైపు చూస్తున్నాయి.
Similar News
News November 8, 2025
భీమవరం: భక్త కనకదాసు జయంతి

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు శ్రీ భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త అని అన్నారు.
News November 8, 2025
ధ్రువ్ జురెల్ మరో సెంచరీ

సౌతాఫ్రికా-Aతో జరుగుతోన్న రెండో అన్‌అఫీషియల్ టెస్టులో ఇండియా-A బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుతంగా ఆడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 132* రన్స్ చేసిన ఆయన, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ బాదారు. తొలి ఇన్నింగ్స్‌లో IND-A 255, SA-A 221 స్కోర్ చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం భారత్ స్కోర్ 355-6గా ఉంది. జురెల్ (117*), పంత్ (48*) క్రీజులో ఉన్నారు.
News November 8, 2025
48 మంది ఎమ్మెల్యేలపై CBN సీరియస్

AP: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలో పాల్గొనడం లేదని మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని పార్టీ కేంద్ర కార్యాలయం సభ్యులతో సమావేశం సందర్భంగా ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, MLAలు పాల్గొనాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే నచ్చిన కార్యకర్తలనే కాకుండా పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించాలన్నారు.


