News November 8, 2025

నరసన్నపేట: పంచలోహ విగ్రహాల అప్పగింత

image

నరసన్నపేటలోని సిద్ధాశ్రమంలో ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ నిందితుడి వద్ద సమాచారం రాబట్టి, విగ్రహాలను సిద్ధాశ్రమ నిర్వాహకులకు శుక్రవారం రాత్రి అందజేశారు.

Similar News

News March 5, 2026

వే2 న్యూస్ కథనానికి స్పందన..తీరిన దివ్యాంగుడి పెన్షన్ టెన్షన్

image

పొందూరు(M) బొట్లపేట వాసి నవీన్ 100% దివ్యాంగుడు. గతంలో వచ్చిన పింఛన్ నిలిచిపోయింది. అచేతనంగా కదలలేని స్థితిలోనున్న నవీన్‌ను భుజంపై మోసుకొని తల్లిదండ్రులు అధికారులు, కార్యాలయాల చుట్టు తిరిగినా సమస్య తీరలేదు. దీనిపై Way2Newsలో OCT22, 2025న ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’ అనే శీర్షికతో కథనం వచ్చింది. అనంతరం వచ్చిన వార్తలకు MLA కూన స్పందించి ఉన్నతాధికారులకు నివేదికివ్వగా పింఛన్ మంజారైంది.

News March 5, 2026

శ్రీకాకుళంలో మర్డర్.. నిందితుడి అరెస్టు

image

శ్రీకాకుళంలోని వెంకన్నగారిపేట మామిడితోట వద్ద గత నెల 26న <<19247482>>హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. DSP వివరాల మేరకు.. వాంబేకాలనీకి చెందిన మోహన్ రావు(40) హిజ్రాల నాయకుడు. అతనికి హయతీనగరానికి చెందిన ఢిల్లీశ్వరరావు(21)తో శారీరక సంబంధం ఏర్పడింది. బైక్ EMI కోసం రూ.10వేలు కావాలని మోహన్‌ను ఢిల్లీ అడగ్గా ఇవ్వలేదు. దీంతో వాళ్ల మధ్య గొడవలు పెరిగాయి. మోహన్ రావుపై కక్ష పెట్టుకుని ఢిల్లీ హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

News March 5, 2026

SKLM: ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 227 మంది గైర్హాజర్

image

శ్రీకాకుళం జిల్లాలో 6 పరీక్ష కేంద్రాల్లో గురువారం జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు 227 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు హిందీ పరీక్షలకు సంబంధించి 929 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా..702 మంది మాత్రమే రాశారు అన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా 2 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 6 సెట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.