News November 8, 2025

కాకినాడ: భార్య పీక కోసి.. ఆపై భర్త ఆత్మహత్య

image

భార్యపై అనుమానంతో కాకినాడ రూరల్ మండలం తూరంగికి చెందిన చీపురుపల్లి రాజేశ్ (36) దారుణానికి ఒడిగట్టారు. కర్ణాటకలో నివాసముంటూ స్వగ్రామం వచ్చిన రాజేశ్.. శుక్రవారం భార్య దేవి (34) గొంతు కోశాడు. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రాజేశ్ పటవల పొలంలో పురుగుల మందు తాగి, గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలపై ఇంద్రపాలెం, కోరంగి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 2, 2026

‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో గంభీరావుపేట ఆలయం

image

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పురాతన సీతారామచంద్రస్వామి ఆలయం అరుదైన ఘనత సాధించింది. ఇక్కడి ఆలయంలో గత 700 ఏళ్లుగా నిరంతరాయంగా వెలుగుతున్న ‘నంద దీపం’ విశిష్టతను గుర్తించిన “తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్” సంస్థ, ఇందులో చోటు కల్పించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధుల నుంచి రికార్డు సర్టిఫికేట్, మెమెంటోను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా అందుకున్నారు.

News April 2, 2026

ప్రత్యేక ధరలు, సబ్సిడీలు ఇవ్వాలని ఎంపీ కావ్య డిమాండ్

image

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో ఎంపీ మాట్లాడుతూ.. మార్కెట్ ఆధారిత ధరల విధానంతో రైతులపై అదనపు భారం పడుతోందని, సాగు ఖర్చులు పెరిగి రైతుల ఆదాయాలు దెబ్బతింటున్నాయన్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యక్ష ఉపశమనం కల్పించే విధంగా ప్రత్యేక ధరలు లేదా సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.

News April 2, 2026

కడప జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన 10th పరీక్షలు.!

image

కడప జిల్లాలో నేటితో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం 167 కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్షను నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్భంగా వాయిదా పడిన పరీక్షను నేడు నిర్వహించారు. నేటి పరీక్షకు 27,826 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 27,650 మంది పరీక్షలు రాశారు. 176 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. 44 కేంద్రాల్లో ఫ్లయింగ్, 68 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించారు.