News November 8, 2025

నెల్లూరులో కీలక సమావేశం.. MLAలు ఏమంటారో?

image

కనుపూరు, గండిపాలెం, స్వర్ణముఖి బ్యారేజి, రాళ్లపాడుతో పాటు సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలకు సాగునీటి విడుదల చేయాల్సి ఉంది. ఆయా కాలువల్లో గుర్రపు డెక్క తీయలేదు. పెన్నా పొర్లు కట్టల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేజర్ల, అనంత సాగరం, ఆత్మకూరులో రూ.18198 కోట్ల పనులకు అనుమతులు రాలేదు. డేగపూడి, బండేపల్లి కెనాల్ భూసేకరణ పెండింగ్ ఉంది. నెల్లూరులో నేడు జరిగే IAB సమావేశంలో MLAలు వీటిపై ఫోకస్ చేయాల్సి ఉంది.

Similar News

News April 2, 2026

నెల్లూరు: 14 మంది మృతికి కారకులైన ఇద్దరు అరెస్ట్

image

మార్కాపురం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని DSP నాగరాజు తెలిపారు. రిపేర్లు వస్తున్నా బస్సు కండీషన్ తెలిసి కూడా బస్సు నడిపిన క్లీనర్ యువరాజ్‌ను, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన బస్సు యజమాని హరికృష్ణను అరెస్టు చేశారు. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లాలోని కలిగిరికి వెళుతున్న బస్సు టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందారు. క్లీనర్‌కి లైసెన్స్ కూడా లేదని అన్నారు.

News April 2, 2026

నెల్లూరు: కూతురి అసభ్యకర ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపి..

image

ప్రకాశం(D), జరుగుమల్లి(M) గంగరాజుపాలేనికి చెందిన అశోక్ కుమార్ మూడేళ్ల క్రితం నెల్లూరుకు బేల్దారి పనుల కోసం వచ్చాడు. ఈక్రమంలో ఓ బాలికకు మాయమాటలు చెప్పి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు తీశాడు. అశోక్ కుమార్ ఆ బాలిక తండ్రికి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండడంతో ఆయన నిలదీశాడు. దీంతో బాలిక ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపాడు. కేసు రుజువు కావడంతో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.9 వేల ఫైన్ విధించింది.

News April 2, 2026

నెల్లూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

నెల్లూరు నగరంలోని సౌత్ స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు వ్యక్తిని ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వయసు సుమారు 60 సంవత్సరాల మధ్యగా ఉన్న వ్యక్తి తెలుపు రంగు షర్ట్, బంగారం అంచుతో కూడిన తెలుపు పంచ ధరించినట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.