News November 8, 2025

ఖమ్మం: 9న ప్రారంభం కానున్న KU దూరవిద్య తరగతులు

image

కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ కాంట్రాక్టు తరగతులు నవంబరు 9 నుంచి ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ ప్రొ.బి.సురేశ్ తెలిపారు. నవంబరు 9, 11, 23, 30తో పాటు డిసెంబరు 7, 13, 14, 21, 28వ తేదీల్లో ఉ.10 గంటలకు తరగతులు జరుగుతాయన్నారు. ఎంఏ, ఎంకామ్ కోర్సులు కేయూ కేంద్రం, మంచిర్యాల, ఖమ్మం, మణుగూరు తదితర అధ్యయన కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 19, 2026

నిజామాబాద్: ‘బ్యాంక్ ఖాతాలు విక్రయం.. ఐదుగురి అరెస్ట్’

image

నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ ఖాతాల ద్వారా మూడు నెలల్లో రూ.31 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇంకా మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానంతో విచారణ కొనసాగుతోంది. ప్రజలు తమ బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని సీపీ హెచ్చరించారు.

News March 19, 2026

ఉగాది ఈవెంట్ సన్నాహాలను పరిశీలించిన కలెక్టర్ డా.లక్ష్మీశ

image

విజయవాడలోని అంబేడ్కర్ కన్వెన్షన్ హాలులో జరగనున్న ఉగాది ఈవెంట్ సన్నాహాలను జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ బుధవారం పరిశీలించారు. ఈవెంట్ నిర్వహిస్తున్న AP క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ చైర్‌ పర్సన్ పి.తేజస్వి, JC ఇలక్కియకు కలెక్టర్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కాగా ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని కళారత్న, ఉగాది పురస్కారాలను ప్రధానం చేయనున్నారు.

News March 19, 2026

ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం: కలెక్టర్

image

నూతన సంవత్సరాది ఉగాది పండుగను తెలుగు సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అనంతపురం కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ గురువారం ఉగాది పండుగను జిల్లా సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.