News November 8, 2025
వరంగల్: సెలవు పెడితే ప్రభుత్వానికి గండి

రిజిస్ట్రార్ సెలవు పెట్టిందే తడువు మూడు రోజుల్లో 21డాక్యుమెంట్లను ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్(జూనియర్ అసిస్టెంట్) రిజిస్టర్ చేసిన ఘటన HNK(D) భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగింది. నిబంధనలకు విరుద్దంగా ఉనికిచర్లలోని 2 సర్వే నంబర్లలో నాన్ లేఅవుట్ వెంచర్లలో 15 ప్లాట్లు, 6 ఇండ్లు సహా మొత్తం 21 రిజిస్ట్రేషన్లు చేశాడు. నిబంధనల ప్రకారం నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దు.
Similar News
News November 8, 2025
జగిత్యాల: భూకబ్జా.. కలెక్టర్‌కు MLA లేఖ

జగిత్యాల కొత్త బస్ స్టాండ్ సమీపంలోని సర్వే నం.138లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై విచారణ జరపాలని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆ ప్రాంతంలో వ్యాపారాలు, పెట్రోల్ బంక్, బార్ నిర్వహణ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని MLA తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు రుజువైతే వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. కాగా, ఇదే భూమిపై మాజీమంత్రి జీవన్ రెడ్డి సైతం లేఖ రాయడంతో చర్చ మొదలయింది.
News November 8, 2025
విశాఖ జూ పార్క్‌లో ఎలుగుబంటి మృతి

విశాఖ జూ పార్క్‌లో 12 ఏళ్ల ఆడ ఎలుగుబంటి శనివారం మృతి చెందినట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. కొన్ని రోజులుగా ఎలుగుబంటి అనారోగ్యంతో ఉందన్నారు. నాలుగు రోజులు క్రితం గర్భాశయంలో మిగిలిపోయిన పిండం (మమ్మీ ఫైడ్ ఫీటస్) వల్ల ఏర్పడిన సెప్టిసీమిక్ షాక్ కారణంగా వెటర్నరీ సిబ్బంది వైద్య సేవలు అందించారని, అయినప్పటికీ ఎలుగుబంటి మరణించినట్లు పేర్కొన్నారు.
News November 8, 2025
నేరేడుచర్ల: ఈతకెళ్లి బాలిక గల్లంతు

మూసీ నదిలో ఈతకు వెళ్లి సుస్మిత (13) అనే బాలిక గల్లంతైన విషాద ఘటన నేరేడుచర్ల మండలం సోమారంలో శనివారం సాయంత్రం జరిగింది. గ్రామంలోని సోమప్ప సోమేశ్వరాలయం వెనుక ఉన్న నదిలో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లగా, సుస్మిత నీట మునిగింది. మిగతా ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన బాలిక కోసం రెస్క్యూ టీంను రంగంలోకి దించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి.


