News April 11, 2024
విశాఖ: కానిస్టేబుల్ కుటుంబంలో విషాదం

విశాఖలో ద్వారక నగర్ ఐఓబీలో ఎస్పీఎఫ్ <<13030401>>కానిస్టేబుల్ శంకరరావు<<>> ఆత్మహత్య ఘటన ఆయన కుటుంబంలో పెను విషాదం నింపింది. ఉ.5 గంటలకు విధులకు వచ్చిన శంకర్రావు..7 గంటలకు తుపాకీతో కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిది వంగర మండలం పొత్తిస గ్రామంగా సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. కాగా.. కానిస్టేబుల్ ఛాతీపై కాల్చుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 5, 2026
విశాఖ: చెత్త కుప్పలో బాంబు అంటూ పరుగులు..

విశాఖలోని తాటిచెట్లపాలెంలో అర్ధరాత్రి బాంబు కలకలం రేపింది. చెత్తకుప్పలో ఉన్న స్కూల్ బ్యాగ్‌లో లైటింగ్ బ్లింక్ కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఐఎఫ్ఆర్ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన పోలీసులు వేంటనే 112కి కాల్ చేసి అప్రమత్తం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్లి పరిశీలించగా పిల్లలు ఆడుకునే బొమ్మ అని నిర్ధారణ అయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News February 5, 2026
‘విశాఖ స్టీల్‌పై కేంద్ర దృక్పథం మారింది’

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వ దృక్పథం అనుకూలంగా ఉందని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ తెలిపారు. అధికారులు, కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. RINLకి ఇంకా దేశవ్యాప్తంగా బ్రాండ్ విలువ ఉందన్నారు. రుణాల వడ్డీ 14% – 8.9% తగ్గిందని, ఉత్పత్తి ఖర్చులు మరింత తగ్గించే అవకాశం ఉందన్నారు. 2 నెలల్లో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తామని CMD మణీష్ రాజ్ గుప్తా పేర్కొన్నారు.
News February 5, 2026
విశాఖలో బార్లకు నేడే లక్కీ డ్రా

విశాఖలో 27 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి లాటరీని నేడు VMRDA చిల్డ్రన్స్ ఏరినాలో నిర్వహించనున్నారు. 52 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయగా 108 దరఖాస్తులు వచ్చాయి. ఒక బారు లైసెన్స్‌కు 4 దరఖాస్తులు వచ్చినపుడే లక్కీ డ్రా నిర్వహిస్తారు. 27 మద్యం బార్లకు మాత్రమే 4 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.22 కోట్లు ఆదాయం లభించిందని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు.


