News November 8, 2025
ఈనెల 9న ప్రారంభం కానున్న KU దూరవిద్య పీజీ కాంట్రాక్టు తరగతులు

కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ కాంట్రాక్టు తరగతులు నవంబరు 9 నుంచి ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ ప్రొ.బి.సురేశ్ తెలిపారు. నవంబరు 9, 11, 23, 30తో పాటు డిసెంబరు 7, 13, 14, 21, 28వ తేదీల్లో ఉ.10 గం.కు తరగతులు జరుగుతాయన్నారు. ఎంఏ, ఎంకామ్ కోర్సులు కేయూ కేంద్రం, మంచిర్యాల, ఖమ్మం, మణుగూరు తదితర అధ్యయన కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 11, 2026
గ్యాస్ బుకింగ్ సిస్టమ్ క్రాష్!

సాధారణం కంటే 8-10 రెట్లు ఎక్కువగా ఫోన్ కాల్స్ రావడంతో ఇండేన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కుప్పకూలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ఇండేన్‌కు 15 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. చాలామంది వినియోగదారులు IVRS మిస్డ్ కాల్ ద్వారానే గ్యాస్ బుకింగ్ చేస్తుంటారు. దేశంలో LPG కొరత ఏర్పడిందని తెలిసి బుకింగ్‌కు పోటెత్తడంతో ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయింది. మరి మీకు ఇండేన్ గ్యాస్ బుక్ అవుతోందా? COMMENT
News March 11, 2026
ఎక్కడా గ్యాస్ కొరత లేదు: చంద్రబాబు

AP: స్కూళ్లు, ఆస్పత్రులకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా జరగాలని CM చంద్రబాబు సూచించారు. ‘ప్రస్తుతం కొరత లేదు. కేంద్రంతో మాట్లాడి ఇబ్బందులు రాకుండా చూడాలి. గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాలి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నిఘా పెట్టాలి’ అని కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. గ్యాస్, ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితుల అంచనాకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.
News March 11, 2026
జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

రోడ్డు భద్రత, ప్రజల రక్షణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్.సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో వాహనదారుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ వంటి పత్రాలను పరిశీలించారు. మద్యం తాగి వాహనం నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


