News November 8, 2025

నేడు హైదరాబాదులో వేములవాడ రాజన్న కళ్యాణం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం శనివారం సాయంత్రం హైదరాబాదులోని ఎన్టీఆర్ గార్డెన్స్ లో నిర్వహించనున్నారు. భక్తి టీవీ వారు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా గత 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల కళ్యాణాన్ని హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీ స్వామివారి కళ్యాణం చేయనున్నారు.

Similar News

News March 28, 2026

TN ఎన్నికల బరిలో నటుడు సుందర్

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డైరెక్టర్, నటుడు సుందర్ తొలిసారి పోటీ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పుతియ నీతి కట్చి(న్యూ జస్టిస్ పార్టీ) అభ్యర్థిగా మధురై సెంట్రల్ నుంచి బరిలో దిగనున్నారు. తన భర్తకు సపోర్ట్ చేయాలని బీజేపీ నేత, నటి ఖుష్బూ అభిమానులు, స్నేహితులను కోరారు. 30 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు సేవ చేయడమే సుందర్ లక్ష్యమని తెలిపారు.
<<-se>>#ELECTIONS2026<<>>

News March 28, 2026

జనగామ: అగ్నివీర్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ నియామకాల కోసం 2027 సంవత్సరానికి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కోదండరాములు తెలిపారు. వివాహం కానీ పురుష అభ్యర్థులు, కనీసం 8వ తరగతి చదివి, 01-07-2005 నుంచి 01-07-2009 మధ్య జన్మించిన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల యువకులు ఏప్రిల్ 1, 2026 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 28, 2026

సిరిసిల్ల: మిడ్ మానేర్ గేట్లు ఎత్తివేత

image

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్ నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 6 గంటల నాటికి నీటి మట్టం 318 మీటర్ల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను 309.56 మీటర్ల వద్ద నమోదైంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలకు గాను ప్రస్తుతం 10.71 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్‌కు ఎటువంటి ఇన్‌ఫ్లోలు లేవు.