News November 8, 2025

KNR: విద్యార్థులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన

image

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా KNR జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారి భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించి సవివరంగా వివరించారు.

Similar News

News March 4, 2026

KNR: సోలార్ విద్యుత్‌‌పై అవగాహన వాహనం ప్రారంభం

image

‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార వాహనాన్ని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే KNR కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. టీఎస్ రెడ్ కో ఆధ్వర్యంలో 99 రోజుల పాటు జిల్లాలోని 16 మండలాల్లో ఈ వాహనం పర్యటించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గృహ వినియోగదారులు ఇంటిపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని అన్నారు.

News March 4, 2026

KNR: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో హోలీ సంబరాలు

image

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హోలీ పండుగ సందర్భంగా మహిళా విద్యార్థులతో సహజ రంగులతో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ హిత దృక్పథంతో, ఆరోగ్య రక్షణను ప్రధానంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ వేడుకలో రసాయనిక రంగులను పూర్తిగా నివారించి సహజ పూలు, ఔషధ గుణాలున్న వనరులతో రంగులను తయారు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి.వరలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News March 4, 2026

కరీంనగర్ జిల్లా కోర్టులో ఘనంగా హోలీ వేడుకలు

image

కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యాయవాదులు, న్యాయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. పరస్పర స్నేహభావం, ఐక్యతకు ప్రతీకగా హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దలు చిన్నారులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. కోర్టు ప్రాంగణం రంగులతో కళకళలాడింది.