News November 8, 2025
చరిత్ర సృష్టించిన ఉమెన్స్ వరల్డ్ కప్

ఇటీవల ముగిసిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో 446 మిలియన్ల మంది వీక్షించినట్లు సంస్థ ప్రకటించింది. ఉమెన్ క్రికెట్‌లో ఇదే అత్యధికమని, 3 వరల్డ్ కప్‌ల టోటల్ వ్యూయర్‌షిప్ కంటే ఎక్కువని పేర్కొంది. అలాగే భారత్-సౌతాఫ్రికా ఫైనల్‌ను 185 మిలియన్ల మంది చూశారని వివరించింది. ఇది 2024 మెన్స్ T20WC ఫైనల్‌తో సమానమని వెల్లడించింది.
Similar News
News March 19, 2026
జనగామ: అతివలకు అండగా పీఎంఎఫ్ఎంఈ

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం అతివలు స్వయం ఉపాధి మార్గాలను అనుసరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి క్రమబద్ధీకరణ పరిశ్రమలను(పీఎంఎఫ్ఎంఈ) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద జనగామ జిల్లాలో 700 యూనిట్ల లక్ష్యం కేటాయించగా ప్రస్తుతం 270 యూనిట్లు పూర్తి చేసినట్లు మహిళా సంఘం బాధ్యులు తెలిపారు.
News March 19, 2026
ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై ఢిల్లీ హైకోర్టుకు గంభీర్

టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు తన పేరు, ఫొటోలు, ఐడెంటిటీని ఆయుధాలుగా వాడుకుంటున్నారని, ఏఐ సాయంతో డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి పోస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. వాటి వల్ల తన పరువుకు భంగం కలిగిందని పేర్కొన్నారు. తనపై పోస్టులు చేసిన ఖాతాలు, ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని, రూ.2.5కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
News March 19, 2026
హార్ముజ్ ఒక్కటే కాదు..: కేంద్రం

హార్ముజ్‌పై భారత్ డిపెండెన్సీ తగ్గిందని.. 70% క్రూడ్ ఇతర ప్రాంతాల నుంచి వస్తోందని కేంద్రం తెలిపింది. LPG సరఫరాను వికేంద్రీకరించేందుకు కృషి చేస్తున్నామంది. రెగ్యులర్‌గా దిగుమతి చేసుకునే ఖతర్‌తో పాటు ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు పెంచనున్నట్లు తెలిపింది. అవసరమైతే రష్యా నుంచి కూడా LPG కొంటామని పేర్కొంది. మరోవైపు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు టోల్‌ఛార్జ్ విధించే ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోంది.


