News November 8, 2025

టీడీపీ కార్యకర్తలకు రూ.135 కోట్లు ఖర్చు చేశాం: లోకేశ్

image

కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో శుక్రవారం మంత్రి నారా లోకేశ్ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలే పార్టీకి అధినేతలన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటి వరకు రూ.135 కోట్లు ఖర్చు చేశామన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 8, 2025

జగిత్యాల: భూకబ్జా.. కలెక్టర్‌కు MLA లేఖ

image

జగిత్యాల కొత్త బస్ స్టాండ్‌ సమీపంలోని సర్వే నం.138లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై విచారణ జరపాలని ఎమ్మెల్యే డా.సంజయ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్‌‌కు లేఖ రాశారు. ఆ ప్రాంతంలో వ్యాపారాలు, పెట్రోల్‌ బంక్‌, బార్‌ నిర్వహణ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని MLA తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు రుజువైతే వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. కాగా, ఇదే భూమిపై మాజీమంత్రి జీవన్‌ రెడ్డి సైతం లేఖ రాయడంతో చర్చ మొదలయింది.

News November 8, 2025

విశాఖ జూ పార్క్‌లో ఎలుగుబంటి మృతి

image

విశాఖ జూ పార్క్‌లో 12 ఏళ్ల ఆడ ఎలుగుబంటి శనివారం మృతి చెందినట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. కొన్ని రోజులుగా ఎలుగుబంటి అనారోగ్యంతో ఉందన్నారు. నాలుగు రోజులు క్రితం గర్భాశయంలో మిగిలిపోయిన పిండం (మమ్మీ ఫైడ్ ఫీటస్) వల్ల ఏర్పడిన సెప్టిసీమిక్ షాక్ కారణంగా వెటర్నరీ సిబ్బంది వైద్య సేవలు అందించారని, అయినప్పటికీ ఎలుగుబంటి మరణించినట్లు పేర్కొన్నారు.

News November 8, 2025

నేరేడుచర్ల: ఈతకెళ్లి బాలిక గల్లంతు

image

మూసీ నదిలో ఈతకు వెళ్లి సుస్మిత (13) అనే బాలిక గల్లంతైన విషాద ఘటన నేరేడుచర్ల మండలం సోమారంలో శనివారం సాయంత్రం జరిగింది. గ్రామంలోని సోమప్ప సోమేశ్వరాలయం వెనుక ఉన్న నదిలో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లగా, సుస్మిత నీట మునిగింది. మిగతా ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన బాలిక కోసం రెస్క్యూ టీంను రంగంలోకి దించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి.