News November 8, 2025

బొంబాయి బాబాలతో పూజల పేరిట టోకరా..!

image

వేములవాడకు చెందిన ఓ కుటుంబం బొంబాయి బాబాలతో పూజల పేరిట మోసపోయిన వైనం వెలుగులోకి వచ్చింది. పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటున్న ఓ వ్యాపారి భార్యకు బాబాలతో పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఇంటి యజమాని నమ్మబలికి పూజలు చేయించారని, ఈ క్రమంలో వ్యాపారికి తెలవకుండా అతని భార్య నుండి సుమారు లక్షల విలువ చేసే బంగారం స్వాహా చేసినట్లు ప్రచారం సాగుతోంది. చివరకు ఆ వ్యాపారి కుటుంబం ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది.

Similar News

News March 21, 2026

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌.. మార్చి 25 లాస్ట్ డేట్

image

మల్కాజ్గిరి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌కు సంబంధించి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను కలెక్టరేట్లో సమర్పించాలన్నారు.

సంగారెడ్డి జిల్లాకు మొండిచేయి చూపిన బడ్జెట్.. సీపీఎం ఆగ్రహం

image

రాష్ట్ర బడ్జెట్‌లో సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం మొండిచేయి చూపిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ విమర్శించారు. జిల్లాకు అత్యంత కీలకమైన సింగూరు ప్రాజెక్టు అభివృద్ధికి కేవలం ₹44.88 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. అలాగే సంగమేశ్వర, బసవేశ్వర, నారింజ ప్రాజెక్టుల ఊసే లేదని, జిల్లాలోని సాగునీటి రంగంపై బడ్జెట్‌లో వివక్ష చూపారని ఆయన ఆరోపించారు.