News November 8, 2025
గంభీరావుపేట: పంట పొలాల్లో రైతు మృతి

వరి పంట పొలంలో రైతు హఠాత్తుగా మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని గజ సింగవరం గ్రామానికి చెందిన ధ్యాన బోయిన విజ్ఞయ్య శుక్రవారం వరి పొలం కోయడానికి వెళ్లగా హఠాత్తుగా కిందపడి మృతి చెందాడు. తనకున్న ఎకరంలో వరి పంట సాగు చేశాడు. అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో.. పంట చేతికస్తుందో లేదో అని ఆందోళనతో కుప్పకూలి హఠాన్మరణం చెందాడు.
Similar News
News March 12, 2026
ఈ మొక్కల్ని నాటితే..

వృక్షాలు మానవుడిని నరక ప్రాయం నుంచి రక్షిస్తాయని వరాహ పురాణం పేర్కొంది. రావి, వేప, మర్రి, దానిమ్మ, మామిడి వంటి పండ్ల చెట్లతో పాటు 10 పూల మొక్కలను నాటితే వారు నరకానికి వెళ్లరని శాస్త్ర వచనం. మనం పెంచే మొక్కలే మరుజన్మలో మనకు సంతానంగా మారుతాయని, వృక్షాలకు కూడా సుఖదుఃఖాలు ఉంటాయని, వాటిని నరకడం పాపమని మనుస్మృతి హెచ్చరిస్తోంది. కాబట్టి మన సంతోషం కోసం, లోక కళ్యాణం కోసం మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి.
News March 12, 2026
నేత్రపర్వంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణ వేడుకను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.
News March 12, 2026
అనంతపురం జిల్లాకు 24వ ర్యాంకు

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా ర్యాంకులు ప్రకటించారు. సంక్షేమ పథకాలు, అధికారుల పనితీరుపై అనంతపురం జిల్లా రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయి 64.6 నుంచి 66.6 శాతానికి పెరిగింది. పనితీరులో మరింత పురోగతి సాధించి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.


