News November 8, 2025
OP పింపుల్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూకశ్మీర్ కుప్వారా(D) కెరాన్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. చొరబాటుపై పక్కా సమాచారంతో ‘ఆపరేషన్ పింపుల్’ పేరుతో గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఓచోట నక్కిన టెర్రరిస్టులను గుర్తించడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రమూకలు హతమయ్యారని, మరికొందరు ట్రాప్‌లో చిక్కుకున్నారని వెల్లడించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.
Similar News
News March 6, 2026
మిస్సైల్స్ అటాక్స్‌కు అవకాశం.. ప్రజలకు మెసేజ్‌లు

యుద్ధంతో గల్ఫ్ కంట్రీ దుబాయ్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మిస్సైళ్ల దాడులకు అవకాశం ఉందంటూ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఇళ్లలోనే ఉండాలని, బయట ఉన్నవాళ్లు వెంటనే స్థానికంగా షెల్టర్లు తీసుకోవాలని ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. మరోవైపు ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ కూడా దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసింది.
News March 6, 2026
సివిల్స్ ఫలితాలు విడుదల

సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకు సాధించారు. ఆ తర్వాతి ర్యాంకుల్లో వరుసగా రాజేశ్వరి సువే, ఆకాన్ష్, రాఘవ్, ఇషాన్ భట్నాగర్ ఉన్నారు. మొత్తంగా 1,087 పోస్టులకు పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈసారి IASకు 180, IFSకు 55, IPSకు 150, గ్రూప్-A సెంట్రల్ సర్వీసెస్‌కు 507, గ్రూప్-B సర్వీసెస్‌కు 195 మంది ఎంపికయ్యారు.
News March 6, 2026
బిహార్ సీఎం నితీశ్ ఆస్తి రూ.1.66 కోట్లు

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు నిన్నటితో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. అభ్యర్థుల అఫిడవిట్ల ప్రకారం బిహార్ CM నితీశ్ కుమార్ అత్యల్ప ఆస్తులు కలిగి ఉన్నారు. తనకు స్థిర, చరాస్తులు ₹1.66Cr, FY25లో వార్షిక ఆదాయం ₹7.87L, చేతిలో కేవలం ₹20,552 నగదు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అత్యధిక ఆస్తులు కలిగిన నేతగా RJD అభ్యర్థి అమరేంద్ర నిలిచారు. తనకు ₹243Cr ఆస్తులు ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు.


