News November 8, 2025
నర్సీపట్నం: స్కిన్ హబ్ సెంటర్లో ట్రైనర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్ సెంటర్లో ట్రైనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ డాక్టర్ రాజు తెలిపారు. వెబ్ టెక్నాలజీస్, అప్లికేషన్ డెవలపర్ – మొబైల్ & వెబ్, అప్లికేషన్ డెవలపర్ కోర్స్ బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. కంప్యూటర్ కోర్సులో 60% ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఈనెల 10న ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
Similar News
News March 30, 2026
రాష్ట్రంలో ఘోరం.. ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు

AP: విశాఖ LVనగర్‌లో దారుణం జరిగింది. నేవీ టెక్నీషియన్ రవీంద్ర(35) ప్రియురాలిని చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. ఇటీవల అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో ప్రియురాలు మౌనిక(29)ను ఆదివారం రాత్రి ఫ్లాట్‌కు పిలిచాడు. తర్వాత ఇద్దరిమధ్య గొడవ జరగడంతో ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అనంతరం PSలో లొంగిపోయాడు. అతడి సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 30, 2026
ఆదిలాబాద్: ఆపదలో ‘అపర సంజీవని’

ఉమ్మడి జిల్లాలో ‘108’ సేవలు లక్షలాది మందికి ప్రాణభిక్ష పెడుతున్నాయి. దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల మధ్య సకాలంలో వైద్యం అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. నెలకు సుమారు 8 వేల మందికి పైగా బాధితులను సురక్షితంగా ఆస్పత్రులకు చేరుస్తున్నాయి. గర్భిణులను, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు ‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందిస్తూ నిరంతరం బాధితుల పాలిట కొంగుబంగారంలా నిలుస్తున్నాయి.
News March 30, 2026
పాలమూరు: 6th క్లాస్ విద్యార్థినికి RTC ఉద్యోగం.. రేషన్ కట్..!

రేషన్ కార్డుల ఏరివేతలో అధికారుల అత్యుత్సాహం సామాన్యులకు శాపంగా మారింది. అచ్చంపేట(M) ఘనపూర్‌కు చెందిన బొడ్డుపల్లి మల్లేశ్, లిఖిత రేషన్ కోసం వెళ్లగా కార్డు రద్దయిందని తెలిసింది. విచారించగా ఇంట్లోని 6th క్లాస్ విద్యార్థినికి RTC ఉద్యోగం ఉందనే నెపంతో కార్డును తొలగించారు. విద్యార్థినికి ఉద్యోగం ఎలా సాధ్యమని ఆయన వాపోతున్నాడు. సాంకేతిక లోపమని అధికారులు చెప్పారు. కార్డు వెంటనే పునరుద్ధరించాలని ఆయన కోరారు.


