News November 8, 2025
KMR: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

ఆన్‌లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. రామారెడ్డి(M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ.1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోసపోయినట్లు తెలిసి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News March 13, 2026
NZB: ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ శుక్రవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 15 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ 1.50 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News March 12, 2026
నిజామాబాద్ GGHలో వరల్డ్ కిడ్నీ డే

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లోని డయాలసిస్ కేంద్రంలో గురువారం వరల్డ్ కిడ్నీ డే నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెడెంట్ డాక్టర్ శ్రీనివాస్ డయాలసిస్ రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ముందే డయాలసిస్ వరకు రాకుండా కేర్ తీసుకొని హై బీపీ, షుగర్ వ్యాధితో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆహార నియమాలు పాటించాలని సూచించారు. డాక్టర్ జలగం తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.
News March 12, 2026
NZB: వారిపై ఎంటీపీ చట్టం ప్రకారం చర్యలు: DMHO

ఎవరైనా పుట్టబోయే శిశువు అమ్మాయి అని తెలియజేసి, వెంటనే గర్భ విచ్చిత్తికి పాల్పడితే వారిపై ఎంటీపీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని NZB DMHO డా.రాజశ్రీ హెచ్చరించారు. గురువారం నిర్వహించిన గర్భస్త పూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. పీసీపీఎన్‌డీటీలో నమోదు అయిన వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలని సూచించారు.


