News November 8, 2025
కరీంనగర్: స్నాతకోత్సవం సరే.. సమస్యల సంగతేంటి?

శాతవాహన యూనివర్సిటీ సమస్యలతో తల్లడిల్లుతున్నా పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. 114 బోధన పోస్టులకు గాను 63, 51 బోధనేతర పోస్టులకు 9 మందితోనే నెట్టుకొస్తున్నారు. 47 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితోనే 12 విభాగాల్లోని 800 మంది విద్యార్థులకు బోధన నడుస్తోంది. నూతన ఇంజినీరింగ్, లా, ఫార్మసీ కళాశాలలకు గుర్తింపు రావాలంటే వెంటనే సిబ్బందిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
Similar News
News March 12, 2026
HYD: జనాభా గణనపై BIG UPDATE

జనాభా గణన- 2027ను గ్రేటర్ వ్యాప్తంగా పకడ్బందీగా చేపట్టి, డూప్లికేషన్ లేకుండా చూడాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. GHMC హెడ్ ఆఫీస్‌లో సెన్సెస్ సర్వేపై ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లు, అదనపు ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లకు 3 రోజుల శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. సర్వే 2 దశల్లో జరుగుతుందని మొదటి దశలో గృహ గణన, రెండో దశలో జనాభా గణన ఉంటుందన్నారు.
News March 12, 2026
భీమవరం: హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం

ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో విద్యార్థులు హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారి గిరిధర్ కుమార్ తెలిపారు. ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఈ సదుపాయం ఎంతో దోహదపడనుంది.
News March 12, 2026
రాష్ట్రంలోనే ప.గో. జిల్లాకు ఫస్ట్ ర్యాంకు

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సర తృతీయ త్రైమాసికానికి సంబంధించి IVRS ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా 74.1 శాతం సానుకూలతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా యంత్రాంగం సమిష్ఠిగా కృషి చేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.


