News November 8, 2025

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: నవాజుద్దీన్

image

కెరీర్ ఆరంభంలో ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు రాక నిరాశలో కూరుకుపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఏదైనా మూవీలో ఛాన్స్ వచ్చినా మళ్లీ పోతుందనే భావనలో ఉండేవాడినన్నారు. దీంతో ఆత్మహత్య ఆలోచనలూ వచ్చాయని చెప్పారు. 2012 నుంచి గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్, కహానీ, తలాష్ మూవీలు సక్సెస్ కావడంతో జీవితంపై ఆశ చిగురించిందని పేర్కొన్నారు.

Similar News

News March 19, 2026

వారికి ఉచితంగా బిందు సేద్య పరికరాలు

image

APలోని 8 జిల్లాల్లో FRA(ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) పట్టాదారులకు 100% రాయితీపై బిందు, 90% రాయితీతో తుంపర సేద్యం పరికరాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అల్లూరి, ఏలూరు, మన్యం, నంద్యాల, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 2.30 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కింద ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

News March 19, 2026

కవిత కొత్త పార్టీ.. పేరు ఇదే

image

TG: జాగృతి చీఫ్ కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆమె జనవరి 23నే దరఖాస్తు చేశారు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలివ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దరఖాస్తులో లోపాలున్నాయని ECI తరఫు న్యాయవాది FEB 27న న్యాయస్థానానికి తెలిపారు. ఈ అంశంపై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.

News March 19, 2026

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,780 తగ్గి రూ.1,54,640కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,550 పతనమై రూ.1,41,750గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.