News November 8, 2025
న్యూస్ అప్‌డేట్స్ 10@AM

* తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న A-16 అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టు. భోలేబాబా కంపెనీకి కెమికల్స్ ఉన్న పామాయిల్ సప్లై చేసినట్లు గుర్తింపు
*తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. పలమనేరులో కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శించనున్న పవన్
*బిహార్ తొలి దశ పోలింగ్‌లో 65.08% ఓటింగ్ నమోదు: ఈసీ
*ఢిల్లీలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని విమాన సర్వీసులు
Similar News
News March 26, 2026
బస్సు ప్రమాదాలు ఆగేదెన్నడు: హీరో నిఖిల్

మార్కాపురం <<19478496>>బస్సు<<>> ప్రమాదంపై టాలీవుడ్ హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు తెలిసి గత 6 నెలల్లో ఇది నాలుగో బస్సు ప్రమాదం. ఈ ఘటనల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు ఆగుతాయి. అధికారులు అన్ని ట్రావెల్స్ బస్సులు & రవాణా సంస్థలను తనిఖీ చేయాలి’ అని PM మోదీ, కేంద్ర & తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులకు నిఖిల్ విజ్ఞప్తి చేశారు.
News March 26, 2026
శ్రీరామ నవమి రోజున ఏం చేయాలంటే?

రేపే శ్రీరామ నవమి. వేకువజామునే నిద్రలేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి. మంగళ స్నానాలు ఆచరించి, ఇంటిని మామిడి తోరణాలు, ముంగిట రంగవల్లికలతో అలంకరించుకోవాలి. సీతారాముల పటాలకు పూజ చేసి.. బెల్లం పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే సమీపంలోని రామాలయానికి వెళ్లి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనాలి. రామనామ స్మరణతో ఈ రోజంతా గడపడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
News March 26, 2026
అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది.
➤ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం
➤ మైనింగ్ లీజులను వడ్డెర సొసైటీలకు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం
➤ ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50% రాయితీ
➤ 96 jr., sr. సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం
➤ 2025-26 ఏడాదిలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ


