News November 8, 2025
మహానంది: కోడిపిల్లకు రెండు తలలు

ఒక కోడి 10 నుంచి 20 గుడ్లు పెడుతుంది. పొదిగే నుంచి పిల్లలను పెట్టే వరకు ఎన్ని పిల్లలకు జన్మనిస్తుందో అంచనా వేయలేం. కానీ మహానందిలోని అబ్బీపురంలో గురువయ్య ఇంట్లో ఓ కోడి పిల్లకు రెండు తలలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గురువారం జన్మించగా శుక్రవారం మృతి చెందిందన్నారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటివి జరుగుతాయని పశు వైద్యాధికారులు తెలిపారు.
Similar News
News March 21, 2026
LC యాప్‌తో విద్యుత్ సిబ్బందికి భద్రత: ASF SE

ASF జిల్లాలో విద్యుత్ ప్రమాదాలను తగ్గించేందుకు విద్యుత్ శాఖ LC యాప్ ప్రవేశపెట్టినట్లు ASF SE ఉత్తమ్ జాడే తెలిపారు. ఈ యాప్ ద్వారా లైన్ క్లియర్ అనుమతులు డిజిటల్‌గా జారీ అవుతాయని, సిబ్బంది పని చేసే ఫీడర్, లైన్ వివరాలు స్పష్టంగా అందుతాయన్నారు. తప్పుడు ఎంపికలకు అవకాశం లేకుండా వ్యవస్థ పనిచేస్తుందని, అధికారులు, సిబ్బంది మధ్య రియల్‌టైమ్ సమాచార మార్పిడి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
News March 21, 2026
భార్యతో ఫోన్లో మాట్లాడుతుండగా మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి

సౌదీలో జరిగిన మిస్సైల్ దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. యూపీకి చెందిన రవి గోపాల్ (26) రియాద్‌లోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 18న భార్యతో ఫోన్లో మాట్లాడుతుండగా ఫ్యాక్టరీ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మిస్సైల్ శకలాలు మీద పడటంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని బంధువులు చెప్పారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపేందుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ప్రయత్నిస్తోంది.
News March 21, 2026
భద్రాచలం: పర్ణశాల ప్రత్యేకత తెలుసా.?

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పేరు ప్రపంచమంతా తెలిసిందే. అక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. సీతారామలక్ష్మణులు వనవాసం కాలంలో పర్ణశాలలో కుటీరం నిర్మించుకుని కొన్నేళ్లు నివాసం ఉన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరించింది కూడా ఇక్కడే అని చరిత్ర చెబుతోంది. భద్రాద్రికి వచ్చే భక్తులు పర్ణశాలను కూడా సందర్శించి, చరిత్ర తెలుసుకుంటుంటారు.


